09 మంది పేకాటరాయుళ్ల పట్టివేత*
ఒక లక్షా 06,100 రూపాయలు స్వాధీనం
*09 మంది పేకాటరాయుళ్ల పట్టివేత*
*ఒక లక్షా 06,100 రూపాయలు స్వాధీనం*
కరీంనగర్ లోని సప్తగిరి కాలనీ లో గల జానకి నగర్ లో పేకాట ఆడుతున్న 09మంది తో పాటు ఒక నిర్వహకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా 010,6,100 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
పేకాట ఆడుతున్నారని అందిన పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి జరిపారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న వేములవాడ కు చెందిన నేరెళ్ల శ్రీధర్, జమ్మికుంట కు చెందిన దాంసాని గట్టయ్య, మడిపల్లి కి చెందిన మ్యాకమల్ల శ్రీనివాస్, శ్రీనగర్ కాలనీకి చెందిన వాడం సత్యనారాయణ, శ్రీరాములపల్లి కి చెందిన తిప్పరవేని వీరన్న, వేములవాడ కు చెందిన నేరెళ్ల వెంకటేశం, నేరెళ్ల రాజు, సిరిసిల్లకు చెందిన జెట్టి రామచంద్రం, వరంగల్ జిల్లా ఆత్మకూరు కు చెందిన వత్తి కరునాకర్ లతో పాటుగా నిర్వాహకుడు సుధగోని ప్రవీణ్ ను అదుపులోకి తీసుకొని కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు