తపాలా బ్యాంక్ ఐపిపిబి సేవలను త్వరగా ప్రారంభించాలి
-జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్
జిల్లాలో మొదటి సారిగా పెన్షనర్స్ తప్ప మిగతా ఐ.కె.పి. మెంబర్స్ మరియు ఉపాధి హామీ కూలీలు, ఐ.కె.పి సంఘాలచే అకౌంట్లు త్వరగా ప్రారంభం చేయించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవల ప్రారంభంపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో, మండలాలలో పోస్టాఫీస్ ల ద్వారా కానీ, మొబైల్ ద్వారా కానీ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకుల ద్వారా లావాదేవీలు పొందాలని అన్నారు. ఈ యాప్ ను ఫోన్ లో కూడా డౌన్ లోడ్ చేసుకోచ్చని, వీటీ ద్వారా విద్యుత్ బిల్లులు, ఇన్సూరెన్స్ పేమెంట్, ఆర్.డీ, సమైక్య సమృద్ది నెల వారీ చెల్లింపులు బ్యాంకులకు వెళ్లకుండానే మొబైల్ ద్వారా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో అధార్ కార్డ్ జిరాక్స్, వేలిముద్రల ద్వారా అకౌంట్ ఓపెన్ చేయవచ్చని అన్నారు.రాజేష్ తొర్తి, సీనియర్ మేనేజర్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా తపాలా బ్యాంక్ సేవలు గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీలత రెడ్ది, జిల్లా సమైక్య కార్యదర్శి శ్యామల, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.