జర్నలిస్టులచేస్తా సమస్యల పరిష్కారానికి కృషి
పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి
జర్నలిస్టులచేస్తా సమస్యల పరిష్కారానికి కృషి
– పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పెద్దపెల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం రోజున స్థానిక ప్రెస్ క్లబ్ లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యుజెఎఫ్ ) పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మరియు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తన వంతు కృషి చేస్తానని అన్నారు.జర్నలిస్టులు సమాజంలో ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా పని చేయాలని అన్నారు.తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్యలు మాట్లాడుతూ జర్నలిస్టుల పై జరుగుతున్న దాడులను మరియు జర్నలిస్టు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్హులైన జర్నలిస్టులకు విధంగా వారి హక్కులను తీసుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన హెల్త్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిజమైన జర్నలిస్టులకు అక్రిడేషన్ తో సంబంధం లేదని, పత్రికా యాజమాన్యం ఇచ్చే గుర్తింపు కార్డు సరిపోతుందని అన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం రాష్ట్ర కమిటీ చేస్తోందని అన్నారు.అనంతరం సంఘం గుర్తింపు కార్డులు,ఐదు లక్షల ఇన్సూరెన్స్ బాండ్లు అందజేశారు. ఈ కార్య క్రమంలో తాళ్లపల్లి ఆగయ్య పౌండేషన్ అధ్యక్షులు తాళ్ళపల్లి మనోజ్ గౌడ్,ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఏగోలపు సదయ్య గౌడ్,జాతీయ కౌన్సిల్ సభ్యులు బాబూరావు,రాష్ట్ర,జిల్లా నాయకులు, వివిధ ప్రాంతాల జర్నలిస్ట్ లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.