ఇంటర్ ఫలితాల్లో ర్యాంకు సాధించిన.. -విద్యార్థిని అభినందించిన మేయర్ సునీల్ రావు.
- క్యాంపు కార్యాలయంలో 5011 రూ. నగదు బహుమతి అందించిన మేయర్.
ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించిన కైలోజు పూజ అనే విద్యార్థిని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అభినందించారు. కరీంనగర్లోని 30 వ డివిజన్ మారుతి నగర్ కు చెందిన కైలోజు పూజ తండ్రి నరెంధర్ కార్పొరేటర్ నేతికుంట యాదయ్య తో కలిసి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కైలోజు పూజ అనే విద్యార్థిని ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ లో 467 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించింది. ఈ నేపథ్యంలో బుధవారం రోజు భగత్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో మేయర్ సునీల్ రావు కలిశారు. 467 మార్కులతో రాష్ట్రంలో ద్వితీయ స్థానం సాధించిన నిరుపేద కుటుంబానికి చెందిన పూజ అనే విద్యార్థిని మేయర్ సునీల్ రావు శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చం అందించి అభినందించారు. ఉత్తమ ర్యాంకు సాధించిన నిరుపేద విద్యార్థికి 5011 రూ. నగదు బహుమతి అందించి ప్రోత్సహించారు. విద్యార్థిని చదివించిన తల్లిదండ్రులకు మేయర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ… ఇంటర్ ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత శాతం సాధించి కరీంనగర్ నగరం పేరును నిలబెట్టిన విద్యార్థిని విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని ర్యాంకులు సాధించి రాష్ట్రంలో జిల్లా పేరును మొదటి స్థానంలో నిలపాలని కోరారు. ఉన్నతమైన చదువులు చదివి మంచి ఉద్యోగాన్ని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నేతికుంట యాదయ్య, గుగ్గిళ్ళ జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.