జిల్లా టూర్ కు వచ్చిన బీజేపీ నేతల పై మేయర్ ఫైర్

0 13,879

కరీంనగర్ జిల్లా కు వచ్చిన బీజేపీ టూరిస్టు నేతలు జరుగుతున్న వాస్తవాలను గమనించి… సత్యాలను తెలుసుకోవాలని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు సూచించారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం రోజు మీడియా సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ నియోజకవర్గంకు సంబంధించి రాజస్థాన్ రాష్ట్ర అధ్యక్షులు సతీష్ పూనియా, మానకొండూర్ నియోజకవర్గం సంబంధించి పార్లమెంటు సభ్యుడు వెస్ట్ బెంగాల్ నేత జయంత్ కుమార్ రాయ్, హుజురాబాద్ కు సంబంధించి కేంద్రమంత్రి ఉత్తరప్రదేశ్ నేత మహేంద్ర నాథ్ పాండే, చొప్పదండి నియోజకవర్గం సంబంధించి కేంద్ర మంత్రి మధ్యప్రదేశ్ నేత వీరేంద్ర కుమార్ కరీంనగర్ జిల్లా లో పర్యటించి
మా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని పరీశీలించి వాస్తవాలను గమనించాలని కోరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బిజెపి పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి సంక్షేమం జరిగేలా చూడాలని సూచించారు. మన రాష్ట్రంలో జరిగిన… జరుగుతున్న అభివృద్ధిలో కనీసం 10% అభివృద్ధి నైనా బిజెపి ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మీ బిజెపి నాయకులు ఎంపీలు మంత్రులు అసత్యాలు అబద్ధాలు అవాస్తవాలను మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్న అభివృద్ధి… రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని మీ పర్యటన ద్వారా పరిశీలించి వాస్తవాలను గమనించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం త్రాగు సాగునీటి కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణం చేయడం జరిగిందని… కేంద్ర ప్రభుత్వం కు చెందిన ఒక్క రూపాయి కూడా లేదని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నుండి నయా పైసా కేటాయించలేదని విమర్శించారు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమ పథకాలకు కూడా కేంద్రం నుండి ఎలాంటి ప్రోత్సాహం లేదని స్పష్టం చేశారు. పేదింటి బిడ్డలు పెళ్లిల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మీ, షాధీముభారక్, లాంటి పథకాలు మీ ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైన అమలౌతున్నాయా… కంపేర్ చేయాలన్నారు. ఎందుకంటే రెండు రోజులు జిల్లాలో పర్యటించి ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అందిస్తున్న సంక్షేమం మీ బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైన అమలవుతున్నాయా అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలన్నారు. వ్యవసాయం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 24 గంటల కరెంటును అందిస్తుంటే మీరు పాలిచ్చే రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్ 24 గంటలు అందిస్తున్నారా అనేది పోల్చుకోవాలన్నారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పంటకు అందిస్తున్న రైతు బంధు, రైతు చనిపోతే అందించే ఐదు లక్షల రైతు బీమా, పండించిన పంటను రైతుకు భారం కాకుండా ప్రభుత్వం కొనుగోలు చేసే లాంటి విషయాలను తప్పకుండా తెలుసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న 2016 రూపాయల ఆసరా పెన్షన్, 3016 రూపాయల వికలాంగుల పెన్షన్, ఒంటరి మహిళా పెన్షన్, గీతా కార్మికుల పెన్షన్, నేత కార్మికుల పెన్షన్లు గురించి పర్యటనకు వచ్చిన నేతలు తెలుసుకోవాలని సూచించారు. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇలాంటి పెన్షన్ పథకాలు అమలు కావడం లేదని అన్నారు. మీ బీజేపీ ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు లేవు కాబట్టి తెలుసుకుంటే బాగుంటుందని సూచన చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాల వాస్తవాలను గమనిస్తే… ఇలాంటి సంక్షేమం మన రాష్ట్రాల్లో కూడా చేయాలనే ఆలోచనలో భగవంతుడు మీకు కల్పిస్తాడని అన్నారు. తెలంగాణలో ఉన్న మీ బీజేపీ నాయకులు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లలో మా వాటా కూడా ఉందని అసత్యాలు, అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా కనీసం రెండు పైసలు కూడా లేదని ఎద్దేవ చేశారు. దేశంలో అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు అయిన కాలేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో ఎలా పూర్తి చేసింది, మిగతా ప్రాజెక్టులను ఎలా నిర్మాణం చేసింది ఘనతను పర్యటనకు వచ్చిన బిజెపి నాయకులు తెలుసుకోవాలన్నారు. ఇవన్నీ వాస్తవాలు తెలుసుకుంటేనే మీరు చేస్తున్న టూర్ కు సార్థకత దక్కుతుందని అన్నారు. ఎంత సేపు ప్రజలను మభ్యపెట్టి…అబద్ధాలు, అవాస్తవాలు చెప్పి కాలం వెల్లధీయడం కాదు బీజేపీ నాయకులు చేయాల్సింది నిజాలను తెలుసుకోవాలన్నారు. మీరు జరిపే కార్యవర్గ సమావేశం లో ఇలాంటి వాస్తవాలను మాట్లాడలన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏడు పథకాలను ప్రకటిస్తే అందులో ఎలాంటి పారామీటర్ తీసుకున్న బీజేపీ పాలిస్తున్న ఒక్క గుజరాత్ రాష్ట్రానికే అవార్డు దక్కిందని మిగతా ఆరు రాష్ట్రాలు ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలే అన్నారు. అలాంటి అవార్డులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకి అవార్డులు దక్కయన్నారు. ఆవార్డుల్లో ఎక్కడ కూడా బిజెపి పాలిత రాష్ట్రాలకు చోటు లేదన్నారు. కరీంనగర్ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సతీష్ పూనే నగరం ఎలా అభివృద్ధి చెందిందో ఫీల్డ్ పై వెళ్లి చూడాలన్నారు. మీ బిజెపి నాయకులు చెప్పే మాటలను నమ్మకుండా వాస్తవాలంటూ గమనించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్తశుద్ధి ఎలా ఉందో బిజెపి నేతలు తెలుసుకోవాలన్నారు. ఈ మీడియా సమావేశంలో టిఆర్ఎస్ కార్పొరేటర్లు మరియు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents