పెంచిన జిఎస్టీ వెంటనే తగ్గించాలి
-ఏఐఎస్బి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులిమాటి సంతోష్
కరీంనగర్: నీరు పేద ప్రజలు కావాల్సిన గంజి, సద్దుకుడు, తడిగుడ్డ పై జీఎస్ స్టీ పెంచడమే కాకుండా పెరుగు, బటర్ మిల్క్,తేనే మీద కూడా జీఎస్ స్టీ పెంచి కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తుందని అల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ పార్టీ కరీంనగర్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులిమాటి సంతోష్ విమర్శించారు. కరీంనగర్ లోని ఏఐఎస్బి ఉత్తర తెలంగాణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం పెంచిన జిఎస్టీ ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పులిమాటి సంతోష్ మాట్లాడుతూ పేదల నోటికాడి బుక్క అందకుండా గంజి,సద్దికూడు, తడిగుడ్డ అందకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి వస్తువు పై జిఎస్టీ పెంచడం సరైంది కాదన్నారు. మధ్య తరగతి ప్రజలు, నీరు పేదల మనుగడ ప్రశ్నర్థకంగా మారిందన్నారు. వెంటనే పెంచిన జిఎస్టీ తగ్గించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.