ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు తగ్గించాలి విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలి.

SFI DYFI AIDWA PATNAMకమిటీలు డిమాండ్.

0 2,281

కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలలో విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలి నియంత్రణకై చట్టాన్నిఅమలు చేయాలి అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫీజులను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ పట్నం బాధ్యులు జిల్లా ప్రధాన కార్యదర్శిలు రజనీకాంత్ తిరుపతి రాజేష్ డిమాండ్ చేశారు.
స్థానిక మంటమ్మ తోట కార్యాలయంలోని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రజనీకాంత్ డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి పట్నం బాధ్యులు రాజేశం ఏఐవైఎఫ్ యుగేందర్ పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి రత్నం రమేష్ గిరిన సంఘం నగర కార్యదర్శి జి రవీందర్ నాయక్ ఇన్సూరెన్స్ యూనియన్ నాయకులు రవీందర్ హాజరై మాట్లాడుతూ కార్పొరేట్ ప్రవేట్ పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనకు విరుద్ధంగా ఐఐటీ జేఈఈ మెయిన్స్ ఒలంపియాడ్ తప్పుడు పేర్లు పెట్టి ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని వారు అన్నారు. ప్రభుత్వ నిబంధనకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్యపుస్తకాలు యూనిఫాము అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తున్నారని వారు అన్నారు.ప్రభుత్వ నిబంధనకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రవేట్ పాఠశాల యాజమాన్యాలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎంఈఓ పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ ప్రవేట్ స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం వత్తస్సు పలుకుతుందని వారు అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ పేద విద్యార్థులకు విద్యను అందని ద్రాక్షగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని వారు ప్రభుత్వాన్ని విమర్శించారు.ఇప్పటికైనా ప్రైవేట్ స్కూళ్ల దోపిడిని అరికట్టి ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో విద్యాధికారి ప్రైవేట్ స్కూళ్లకు కొమ్ముకాస్తున్న డీఈఓపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ప్రవేట్ స్కూల్ ఆర్థిక దోపిడీ కార్యకర్త ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించకపోతే విద్యార్థి యువజన కుల సంఘాల ఆధ్వర్యంలో మరింత ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు.ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు డి నరేష్ పటేల్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గజ్జల శ్రీకాంత్ డివైఎఫ్ఐ నాయకులు అజయ్ రాజేందర్ ఎస్ఎఫ్ఐ నాయకులు రోహిత్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents