*8 మంది పేకాటరాయుళ్ల పట్టివేత*
50,680 రూపాయలు స్వాధీనం*
సదాశివ పల్లి శివారు తీగల వంతెన సమీపంలో పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను శుక్రవారం నాడు రాత్రి కరీంనగర్ టాస్క్ ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్దనుండి 50,680 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.అలుగునూరు గ్రామానికి చెందిన వీణవంక తిరుపతి, పంతంగి అనిల్, బి కృష్ణారెడ్డి, సదాశివ పల్లికి చెందిన పాఠ్యం తిరుపతి, కోతి రాంపూర్ కు చెందిన తమ్మినేని రమేష్, గాంధీనగర్ కు చెందిన పోచంపల్లి రాజు, బోయవాడకు చెందిన సర్దార్ అర్జిత్ సింగ్, చెంజర్లకు చెందిన గుడేటి సదానందం లు పట్టుబడ్డారు. వీరిని మానకొండూరు పోలీస్ స్టేషన్లో అప్పగించారు.