తెలంగాణ బిడ్డను అవమానించిన బీజేపీ. ప్రధానికి వంట చేయాలంటూ పిలిచి…లోపలికీ నో ఎంట్రీ
బీజేపీతో ఎట్ల ఉంటదో మరోసారి నిరూపితమైంది. ప్రధాని మోడీకి తెలంగాణ వంటల రుచులు చూపించాలంటూ…పిలిచి అవమానించారు. కరీంనగర్ కు చెందిన యాదమ్మ అనే మహిళను ప్రధానికి వంట చేయాలంటూ ఆహ్వానించారు. కానీ తీరా తనను లోపలికి కూడా రానివ్వకుండా అవమానించారు. దీంతో చేసేదేమీ లేక యాదమ్మ రోడ్డుమీదే ఉండిపోయింది. ముందుగా పాస్ లేదంటూ పోలీసులు లోపలికి పంపిచలేదు. ఆ తర్వాత పాస్ లు తెచ్చుకున్నప్పటికీ వెహికల్ లేదంటూ వారిని అక్కడే నిలిపివేశారు. ప్రధానికి తెలంగాణ ఆడబిడ్డ తో వంటలు చేయించి రుచి చూపిస్తామని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఇవన్నీ ప్రచార అర్భాటమేనని తేలిపోయింది. యాదమ్మను అవమానించి కనీసం ఆమెకు సభ స్థలానికి కూడా పంపించలేదు. చివరికి బండి సంజయ్ చొరవతో లోపలికి అనుమతించారని సమాచారం. బీజేపీ నేతల తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.