పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు పంపిణి

0 907


 

కరీంనగర్ జిల్లా పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో కొత్తపల్లి పట్టణంలోని నిరుపేద పద్మశాలి కుటుంబాల విద్యార్థులకు శనివారం రోజున రూ30,000 (ముఫ్ఫై వేలు) విలువైన స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు గుడిమల్ల శ్రీకాంత్ మాట్లాడుతూ జిల్లాలోని పద్మశాలి పేద విద్యార్థులు ఎవరైనా చదువుకోడానికి ఇబ్బందులున్నచో మా దృష్టికి తీసుకురావాలని, వారికి యువజన సంఘం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఇంటర్ నుండి పీజీ వరకు చదువుతున్న పద్మశాలి విద్యార్థులు ఎవరైనా మన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మశాలి హాస్టల్లో ఉచితంగా వసతి కల్పించబడును. విద్యార్థులు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు గుడిమల్ల శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులు దూడం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మహేశుని మల్లేశం, కోశాధికారి దూడం శ్రీనివాస్, జిల్లా పద్మశాలి సంఘం గౌరవాధ్యక్షులు వాసాల రమేష్, యువజన ఉపాధ్యక్షులు కొలిపాక కమలాకర్, బూర్ల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు రుద్ర పరం, పెంటి శ్రీకాంత్, పెంటి శేఖర్, మెతుకు చైతన్య, ఎల్లె మహేష్, కౌన్సిలర్ స్వర్గం నర్సయ్య, నేత బజార్ అధ్యక్షులు మంచికట్ల కోటేశ్వర్, పద్మశాలి నాయకులు కమటం రాజేశం, కట్ల సుధాకర్, దూస మునిందర్ తదితరులు, కులబాంధవులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents