ఖనిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు… నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు..
ఖనిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు… నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు..
రామగుండం సిపి శ్రీ చెంద్రశేకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదావరిఖని లో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కూడళ్ళతోపాటు, శివారులో వాహనాల తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాల, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై , ఇన్సూరెన్స్ లేని వారిపై, నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం లేని, వాహనాలపై కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా సిఐ రమేష్ బాబు గారు మాట్లాడుతూ…..రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా వాహన ధ్రువీకరణ పత్రాలు , లైసెన్సులు, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాన్స్పోర్ట్ చేసే వాహనాలలో ప్రజలను తీసుకోని వంటివి చట్ట వ్యతిరేకమైన చర్యలు ఇట్టి వాహనాల పై కేసులు నమోదు చేసి సీజ్ చేయడమే కాకుండా, వాహన యజమానుల పై కూడా కేసు నమోదు చేసి గౌరవ కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుందని వారికి శిక్ష పడేలా చేయడం జరుగుతుందని, ద్విచక్ర వాహనాలు నడిపి వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే సమయంలో కూడా సీటు బెల్టు ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుంది అన్నారు. ఇక నుండి ప్రతి రోజు ఆకస్మికంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని సీఐ ప్రదీప్ కుమార్ అన్నారు