సినిమా థియేటర్లకు నోటీసులు జారీచేసిన పోలీస్ కమీషనర్
కమీషనరేట్ లోగల కరీంనగర్ లోని శ్రీనివాస మల్టీప్లెక్స్, జమ్మికుంట లోని మురళి, అన్నపూర్ణ సినిమా థియేటర్లకు కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ నోటీసులు జారీ చేశారు.పైన పేర్కొన్న సినిమా థియేటర్ల యజమానులు బిఫారం లైసెన్స్ రెన్యువల్ కోసం సరైన ధ్రువపత్రాలు అందజేయకపోవడంతో ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. థియేటర్ల నిర్వహణకు సరైన ధ్రుపత్రాలు అందజేయాలని కోరారు