Print Friendly, PDF & Email

ఎస్ఐ పోస్టుల రాత పరీక్షకు ఏర్పాట్లు, నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: సీపీ రామగుండం

0 775

ఆగస్టు 7న నిర్వహించబోయే ఎస్సై పోస్టుల నియామక ప్రిలిమినరీ పరీక్షను పకడ్బంధిగా నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐ. పీ. ఎస్. , పేర్కొన్నారు. మంగళవారం ఏన్టీపీసీ లోని మిలీనియం హల్ లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నియమావళి మేరకు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిండెంట్ లకు, అబ్జర్వర్లకు, రీజినల్ కోఆర్డినేటర్స్ , పోలీస్ సిబ్బందికి ” అవగాహన కార్యక్రమం” నిర్వహించి పరీక్ష సమయంలో సిబ్బంది, అభ్యర్థులు పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. సీపీ మాట్లాడుతూ, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 24 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారనీ, ఇందులో పెద్దపల్లి జోన్ పరిధిలో 07 పరీక్ష కేంద్రాలు, మంచిర్యాల జోన్ పరిధిలో లో 17 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారని, అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలకు పగడ్బందీగా నిర్వహించాలని సీపీ ఆదేశించారు. ఈ అవగాహన కార్యక్రమంలో అదనపు డీ. సీ. పీ (అడ్మిన్) అఖిల్ మహాజన్ ఐపిఎస్, సంబందిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్ఐ పోస్టుల రాత పరీక్షకు ఏర్పాట్లు, నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ: సీపీ రామగుండం

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents