పిడుగుపాటుకు యువ రైతు మృతి
మంథని నియోజకవర్గంలోని మల్హర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ పనికి వెళ్లిన యువ రైతును పిడుగు బలి తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే మండలంలోని తాడిచెర్ల పంచాయతి పరిధిలోని శాత్రాజ్ పల్లి గ్రామానికి చెందిన కాటం రఘుపతి రెడ్డి(25) అనే యువకుడు మంగళవార తన తల్లిదండ్రుల తో కలిసి వ్యవసాయ పొలంలో నాటు వేసేందుకు వెళ్లగా ఒక్కసారిగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.