బ్రదర్ ఇక్కడ నేనున్నా.. నిఖిల్‌కి సపోర్ట్ చేసి అడ్డంగా బుక్కైన మంచు విష్ణు
సినీ పరిశ్రమలో బడా బాబుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అన్నీ వారి కనుసైగల్లోనే జరుగుతుంటాయని ఇప్పటికే ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి.
చాలా మంది యాక్టర్స్ ఈ విషయమై నేరుగా మాట్లాడారు కూడా. ఈ క్రమంలోనే రీసెంట్ గా ఇండస్ట్రీపై యంగ్ హీరో నిఖిల్ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.
కార్తికేయ 2 (karthikeya 2) మూవీ రిలీజ్ విషయంలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు నిఖిల్. తన సినిమా కార్తికేయ 2కి ఆగస్ట్ 12న రిలీజ్ డేట్ అనేది అంత సులభంగా దొరకలేదని చెబుతూ దాని వెనుక జరిగిన తతంగాలు అన్నీ వివరంగా చెప్పారు. ఈ విషయాలు చెబుతున్న క్రమంలో ఎమోషనల్ అయ్యారు.
ఆగస్ట్ 12న మా కార్తికేయ 2 సినిమా రిలీజ్ డేట్ ప్రకటించగానే కొందరు పెద్దలు అడ్డు పడ్డారని, ఆ డేట్ వద్దని చెప్పారని తెలిపారు నిఖిల్. తన సినిమా రిలీజ్ అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయని చెప్పారు.
ఇప్పుడైతే మీ సినిమాకు థియేటర్స్ దొరకవు. అక్టోబర్ లేదా నవంబర్‌కి వెళ్లిపోండి అని కొందరు సినీ పెద్దలు చెప్పినట్లు నిఖిల్ పేర్కొన్నారు. ఆ మాట తనను ఎంతో బాధపెట్టిందని, అది జరిగాక వారం రోజులు ఏడ్చానని నిఖిల్ చెప్పుకొచ్చారు. సినీ ఇండస్ట్రీలోని రాజకీయాలతో విసిగిపోయానని అన్నారు.
దీంతో కార్తికేయ 2 సినిమాకు అడ్డుపడిన ఆ సినీ పెద్దలు ఎవరు? నిఖిల్ లాంటి టాలెంట్ ఉన్న హీరోలకే ఈ పరిస్థితి ఎదురైతే ఇక బ్యాక్ గ్రౌండ్ లేని చిన్న హీరోల గతి ఏంటి? అనే కోణంలో చర్చలు ముదిరాయి. ఇండస్ట్రీలో బడా బాబుల పెత్తనానికి కళ్లెం వేయాల్సిందే అనే టాక్ ముదిరింది.
ఈ పరిస్థితుల నడుమ.. బ్రదర్ ఇక్కడ నేనున్నా నీకు అండగా ఉంటా అంటూ నిఖిల్‌కి పూర్తి మద్దతు పలికారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెడుతూ నిఖిల్‌ని ట్యాగ్ చేశారు మంచు విష్ణు.
ఇది చూసి ఆయన మంచు విష్ణు కాదు మంచి విష్ణు అని కొందరు కామెంట్స్ పెడుతుంటే.. నీకే దిక్కు లేదు నువ్ వస్తావా? అంటూ ఇంకొందరు మంచు విష్ణుని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. టార్గెట్ ఎవరు? మంచు బాబు అనేవారు కూడా కనిపిస్తున్నారు. ఏదేమైనా మంచు విష్ణు ట్వీట్ మాత్రం నెట్టింట రచ్చ చేస్తోంది.