మురికి కాలువలో పడి బాలుడు మృతి
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో బుధవారం కారణం చోటుచేసుకుంది. పట్టణంలోని ఫకీరువాడకు చెందిన అక్బర్ కుమారుడు(4) ప్రమాదవశాత్తు ఇంటి ముందు ఉన్న మురికి కాలువలో పడి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీంతో కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు గాలించగా హేమ టాకీస్ వద్ద ముళ్ల చెట్టుకు తట్టుకొని ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు.