నటుడు చందన్ కుమార్ పై శాశ్వత నిషేధం
రెండు రోజుల క్రితం ‘సావిత్రమ్మ గారి అబ్బాయి’ సీరియల్ నటుడు చందన్ కుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ ని తిట్టి, కొట్టిన ఘటన కలకలం రేపింది. కారణం లేకుండానే బూతులు తిట్టాడని, తన తల్లిని దూషించాడని అసిస్టెంట్ డైరెక్టర్ హీరోపై సీరియస్ అయ్యాడు. దీంతో ఆగ్రహించిన అసిస్టెంట్ డైరెక్టర్ చందన్ కుమార్ ని అందరి ముందే కొట్టడంతో గొడవ పెద్దదైంది. దీంతో చందన్ పై టెలివిజన్ వర్కర్స్ ఫెడరేషన్ జీవితకాల నిషేధం విధించింది.