కరీంనగర్ స్మార్ట్ సిటి పనుల్లో అవినీతి, అక్రమాలు
బండారి శేఖర్, (ఏ.ఐఎఫ్.బి) జిల్లా ప్రధాన కార్యదర్శి కరీంనగర్
కరీంనగర్ స్మార్ట్ సిటి పేరిట జరుగుతున్న పనుల్లో వేల కోట్ల అవినీతి, అక్రమాలు జరిగాయి. స్మార్ట్ సిటీ నిబంధనలకు విరుద్ధంగా స్మార్ట్ నిధులు ఖర్చులా, అభివృద్ది పనుల పేరిట జరుగుతున్న ఈ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్పోరేటర్ల నుండి మంత్రి స్థాయి వరకు వేల కోట్లు చేతులు మారుతున్నయని ఆల్ ఇండియా ఫార్వర్ట్ బ్లాక్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కుంభకోణంపై, మంత్రి కేటిఆర్, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరుపాలి.స్మార్ట్ సిటీ అవినీతి అక్రమాలపై మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ గార్లకు వినతి పత్రం ఇస్తామని తెలిపారు.దేశంలోనే ఎక్కడ లేని విధంగా కరీంనగర్‌లో స్మార్ట్ సిటి పేరిట వేలాది కోట్ల అవినీతి, అక్రమాలు జరిగాయి. 18 వందల కోట్ల అభివృద్ది పనుల్లో సుమారు రూ.800 కోట్ల మేరకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కమీషన్ల పేరిట కాజేశారు. ఇద్దరు ప్రజాప్రతినిధులకు 10శాతం చొప్పున కమీషన్ల రూపేణ ఇద్దరికే ( ఒక్కొక్కరికీ 10 శాతం చొప్పున ) సుమారు రూ. 500 కోట్లు జేబుల్లో వేళ్లగా, మరో ప్రముఖుడు రూ.100 కోట్లకు పైగా వెనుకేసుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా గుడ్ విల్ కింద ఇటీవల ఒకరిద్దరు విలాసవంతమైన ఇంద్ర భవనాల్లాంటి బంగళాలు కట్టించుకున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇదంతా ప్రజల సొమ్ము కావున ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. స్మార్ట్ సిటి నిబంధనలకు విరుద్దంగా విచ్చలవిడిగా ఒపెన్ ఇల్లిగల్ లే అవుట్ లు సృష్టించి స్మార్ట్ నిధుల డబ్బులతో రోడ్లు నిర్మాణం పూర్తి చేయడం చట్టానికి విరుద్దమని అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటిలో అభివృద్ది పేరిట రూ.1800 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.500 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 500 కోట్లతో పాటు ప్రయివేటు భాగస్వామ్యంతో మరో రూ.800 కోట్టు నిధుల చొప్పున కరీంనగర్ స్మార్ట్ సిటి పేరిట ఖర్చు చేస్తున్నారు. ఇట్టి నిధుల ఖర్చుల వివరాలను నగర ప్రజలకు బహిరంగ పర్చలని, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం(పిపిపి)తో చేపట్టిన అభివృద్ది పనులు ఎక్కడెక్కడ చేపట్టారు. ఎక్కెడెక్కడ ఎన్నెన్ని కోట్లు ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాలి, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎడిబి పరిధిలో ఏలాంటి అభివృద్ది పనులు చేయకుండానే అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు వారికి అనుకూల ప్రాంతాలలో, టిఆర్ఎస్ కార్ఫోరేటర్లు ప్రాథినిత్యం వహిస్తున్న వివిధ డివిజన్లలో మాత్రమే పనులు చేసి కోట్ల నిధులు కొల్ల గొడుతున్నారని విమర్శించారు. విచ్చల విడిగా స్మార్ట్ సిటి పనుల్లో అవినీతి, ఆక్రమాలు జరుగుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు. టిఆర్ఎస్ నాయకులు అధికార దుర్వనియోగానికి పాల్పడుతున్నారు.గతంలో ఉన్న టెండర్ రద్దు చేశారు, నూతన టెండర్ల పక్రియలో గోలమాల్, అవినీతి రాజ్యమేలుతోంది. ఇతర పార్టీల కార్పోరేటర్లు ఉన్న డివిజన్లలో మంజూరైన అభివృద్ది పనుల టెండర్లను తొలగించి వారికి అనుకూలమైన డివిజన్లలో రోడ్లు, ఇతర అభివృద్ది పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ పనుల్లో ఎన్నో అవినీతి అక్రమాలు బట్టబయలు అవుతున్నాయి. ఇందుకు నిదర్శనం పలు డివిజన్లలో రాత్రి వేళలలో పనులు చేసి నాణ్యత లోపంతో రోడ్లు, ప్లాట్‌ఫాంలు నిర్మించి అక్రమాలకు ఆజ్యం పోస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. రాత్రి వేళల్లో పనులు చేస్తే ఎవరు పట్టించుకోరని హడావిడిగా పనులు చేసి అప్పనంగా కోట్లకు కోట్లు జేబుల్లో వేసుకున్నారు. పనుల్లో నాణ్యత లేకుండా చేపట్టడంతో ఇటీవల కురిసిన చిన్న పాటి వర్షాలకే నగరంలో పలు ప్రాంతాలు, డివిజన్లు, కాలనీలు జలమయం అయినాయి. గణేశ్ నగర్, కోతిరాంపూర్, రాంనగర్, అశోక్‌నగర్ తదితర డివిజన్లతో పాటు, విలీన గ్రామాలు ఇతర లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు నానా అవస్తలకు గురయ్యారు. డ్రైనేజీ ద్వరా నీరు పోయే దారిలేక వర్షం నీరు రోడ్లపై, కాలనీలలో నిలిచిపోయాయి. పాత గోడలు, ఇండ్లు కూలిపోయాయి. వేసిన రోడ్లు కొట్టుకుపోయాయి. మరి కొన్ని చోట్ల పనుల్లో నాణ్యత లేకపోవడంతో రోడ్లు ఆనవాళ్లు లేకుండా పోయాయి. స్మార్ట్ సిటి పేరిట విడుదలైన రూ.1800 కోట్లతో చేపట్టిన పనుల్లో వెలుగు చూస్తున్న కుంభకోణాలు, అవినీతి, అక్రమాలపై తక్షణమే బహిరంగంగా సమగ్ర విచారణ జరిపించాలి. స్మార్ట్ సిటి అభివృద్ది పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై ఆల్ ఇండియా ఫార్వర్ట్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు త్వరలో శ్రీకారం చుట్టనున్నాం. నగర పాలిక సంస్థ కార్యలయాన్ని ముట్టడించి ఆందోళన చేపడుతాం అని హెచ్చరించారు.
ఈ పత్రిక విలేకరుల సమావేశంలో కరీంనగర్ ఆర్గనేజింగ్ కార్యదర్శి పులిమాటి సంతోష్,జిల్లా నాయకులు కురువెల్లి శంకర్, గొల్లపల్లి ప్రశాంత్.