Print Friendly, PDF & Email

ఆర్ఎఫ్‌సిఎల్ అక్ర‌మాల‌పై చ‌ర్చ‌లేవీ..

-వైఎస్సార్ టిపి రాష్ర్ట అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్ న‌గేశ్‌

0 15

రామ‌గుండం ప‌ర్టిలైజ‌ర్‌ అండ్ కెమిక‌ల్స్ లిమిటెల్ కంపెనీలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుండి కోట్లాది రుపాయ‌లు దండుకోని చేతులు దులుపుకున్నతీరుపై ప్ర‌భుత్వం వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుని బాధిత నిరుద్యోగుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించి, న్యాయం చేయాల‌ని లేని ప‌క్షంలో వైఎస్సార్ టిపి ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు వైఎస్సార్ టిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్ నగేశ్ డిమా్డ్ చేశారు. సోమ‌వారం క‌రీంన‌గ‌ర్ ప్రెస్‌క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుండి సుమారు. 50 కోట్ల నుండి 75 కోట్ల వ‌ర‌కూ వ‌సూళ్లు చేశార‌ని ఆరోపించారు. ఈ వ‌సూళ్ల దందాలో అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు, అ పార్టీ బ‌డా నేత‌ల అండ‌దండ‌లున్నాయ‌ని ఆరోపించారు. 15 రోజులుగా ఆర్ఎఫ్‌సిఎల్ వ‌ద్ద మోస‌పోయిన నిరుద్యోగులు అందోళ‌న చేస్తున్న ప‌ట్టించుకున్న నాథుడు క‌రువ‌య్యాడ‌ని దుయ్య‌ప‌ట్టారు. ఆర్ఎఫ్‌సిఎల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని ఒక్కోక్క‌రి నుండి రూ.15 ల‌క్ష‌ల చొప్పున 75 కోట్లు వ‌సూళ్లు చేశార‌ని ఆరోపించారు. వెంట‌నే బాధిత నిరుద్యోగుల‌కు ప‌ర్మినెంట్ ఉద్యోగాల‌తో పాటు వారు చెల్లించిన డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగంలో చేరితే మున్ముందు ప‌ర్మినెంట్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో నిరుద్యోగులు ద‌ళారుల చేతిలో మోస‌పోయి ఒక్కోక్క‌రు రూ.15 ల‌క్ష‌లు చెల్లించార‌ని పేర్కొన్నారు. దేశంలో ఎక్క‌డ లేని విధంగా ఇంత పెద్ద స్కాం మ‌రెక్క‌డా జ‌ర‌గ‌లేద‌ని డాక్ట‌ర్ న‌గేష్ ఆరోపించారు. ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుండి కోట్లు డ‌బ్బులు వ‌సూళ్లు చేసిన దోసుల‌పై వెంట‌నే కేసులు న‌మెదు చేసి చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, బాధిత నిరుద్యోగుల‌కు తిరిగి డ‌బ్బులు చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. ఉద్యోగాల పేరిట మోస‌పోయిన నిరుద్యోగుల‌కు మ‌ద్ద‌తు తెలిపేందుకు వెళ్లిన త‌మ వైఎస్సార్ టిపి నాయ‌కుల‌ను పోలీసులు అడ్డుకున్నార‌ని, బంగారు తెలంగాణ పోలీసుల తెలంగాణ‌గా మారింద‌న్నారు. ఆర్ఎఫ్‌సిఎల్ బాదితులను ఎమ్మెల్యే ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ప్ర‌భుత్వం ఈ అంశంపై పూర్తిగా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని అన్నారు.
తెలంగాణ‌లో పోలీసుల రాజ్య‌మేలుతుంద‌ని విమ‌ర్శించారు. వైఎస్సార్ టిపి జిల్లా అధ్య‌క్షుడు అక్కెన‌ప‌ల్లి కుమార్ మాట్లాడుతూ
రామ‌గుండం ఎమ్మెల్యేను న‌మ్మ‌కంతో ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యేగా గెలిపిస్టే ఉద్యోగాల పేరిట మోస‌పోయిన నిరుద్యోగుల‌కు ఎందుకు బాస‌ట నిల‌వ‌డం లేద‌న్నారు. ఈ కుంభ‌కోణంలో రామ‌గుండం ఎమ్మెల్యే హ‌స్తం ఉందని ఆరోపించారు. ఆర్ఎఫ్‌సిఎల్ బాధితుల‌కు వైఎస్సార్ టిపి అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. బాధితుల‌కు న్యాయం జ‌ర‌గ‌కుంటే ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వైఎస్సార్ టిపి జిల్లా నాయ‌కులు ఆర్ న‌ర్స‌య్య‌, బి. ఫ‌ణి కిషోర్‌, పి. శ్రీనివాస్‌. ఎస్‌. రాజ‌న్న‌, ర‌జితారెడ్డి, డి. శ్రీనివాస్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌కాశ్‌, పి. సుమ‌ల‌త‌, సిహెచ్ సుజాత త‌దిత‌రులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents