Print Friendly, PDF & Email

విద్యుత్తు ఉద్యోగులకు టి.డి.పి.మద్దతు.

కళ్యాడపు ఆగయ్య.

0 9

కేంద్రప్రభుత్వం విద్యుత్తుసంస్థను ప్రవేటికరించాలని నిర్ణయించడం,అందుకుగాను నేడు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టేప్రయత్నం చేస్తున్న సందర్భంగా కరీంనగర్ లోని విద్యుత్తు ఉద్యోగులు విద్యుత్తు భవనంలో అందుకు నిరసనగా తేదీ. 8.8.2022.రోజున చేపట్టిన నిరసన సమ్మె లో తేలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కళ్యాడపు ఆగయ్య వారు చేస్తున్న నిరసన సమ్మె లో ఈరోజు మధ్యాహ్నం 1.30 గం.పాల్గొని వారికి పూర్తి మద్దతు తెలిపినారు. కళ్యాడపు ఆగయ్య తోపాటు టి డి పి బి సి విభాగం కరీంనగర్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు శ్రీ చేవూరి నరసింహచారి గారు కూడ పాల్గొని మద్దత్తు తెలిపినారు. ఈసందర్బంగా కళ్యాడపు ఆగయ్య మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు సంస్థను ప్రవేటు పరంచేయా లని ఆలోచించడం సిగ్గుమాలిన చర్య ఇట్టి ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసినారు. దీనివల్ల పెదప్రజానికానికే కాకుండా,అటు రైతాం గానికి ఇటు విద్యుత్తుసంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికి నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున, వినియోగదారుల పై కూడ ఆర్థికబారం పడనున్నందున వెంటనే ప్రైవేటీకరణ బిల్లును ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగినది.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents