Print Friendly, PDF & Email

చెరువులను కాపాడలేని కెసిఆర్ సర్కార్…

బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వ్యాఖ్యలు ..

0 7

టిఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయతో చెరువుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని , చెరువులను టిఆర్ఎస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తుందని, చెరువుల అభివృద్ధి పనులు మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలి కోతకు గురవుతున్నాయని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆరోపించారు.వె- సైదాపూర్ మండలం వెన్కపల్లి తుమ్మల చెరువు తెగిన ప్రాంతాన్ని సోమవారం స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి ఆయన సందర్శించి మాట్లాడారు. వెన్కపల్లి తుమ్మల చెరువుపై దాదాపు 90 లక్షల నిధులతో చేపట్టిన మిషన్ కాకతీయ పనులు నామాత్రంగా చేపట్టడంతో నేడు చెరువు తెగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఇక్కడి ప్రాంతంలో చెరువు మరమ్మత్తులను తూతు మంత్రం గానే లో కూడా చేపట్టారని , చెరువు పటిష్టత కోసం అధికారులు ప్రభుత్వం తగిన కార్యాచరణ చేపట్టకపోవడంతో నేడు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. వెంకపల్లి చెరువు తెగపోవడంతో వె- సైదాపూర్ మండల కేంద్రానికి , అనేక గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, ముఖ్యంగా హుస్నాబాద్ హుజురాబాద్ ఆర్ అండ్ బి ప్రధాన రహదారులే కొట్టుకుపోయాయని తెలిపారు. చెరువు తీయడంతో దాదాపు 400 నుండి 500 ఎకరాల వ్యవసాయ భూముల కు నష్టంకలిగిందని, రైతుల పంట కూడా నీట మునిగిపోయిందని పేర్కొన్నారు. చెరువు పటిష్టత కోసం ప్రణాళికతో పనిచేయాల్సిన అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని, లోగడ బిజెపి ఆధ్వర్యంలో చెరువు మరమ్మత్తు, అభివృద్ధి పటిష్ట పనుల కోసం పలుమార్లు ఆందోళన చేసి విజ్ఞప్తులు చేసిన పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయన విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే వెన్కపల్లి తుమ్మల చెరువు మరమ్మత్తు, పటిష్ట పనులు తక్షణం చేపట్టడానికి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే చెరువు తెగిపోవడంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి, దెబ్బతిన్న రహదారుల పై వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్రెడ్డి, సీనియర్ నాయకులు పల్లేని వేణుగోపాలరావు, ఎంపీటీసీ సభ్యులు జంపాల సంతోష్, జెల్ల మల్లేష్, మండల ప్రధాన కార్యదర్శిలు కోలే చిరంజీవి, గాజుల రమేష్, నెల్లి శ్రీనివాస్, పెరుమాండ్ల భరద్వాజ, సందుపట్ల రవీందర్ రెడ్డి, మహేందర్, నాయకులు కొండ మల్లయ్య ,తాటి పెళ్లి జితేందర్ రెడ్డి ,కొలిపాక, పొన్నం తిరుపతి ,కత్తుల శ్రీనివాస్, బండి రమేష్ ,సుదర్శన్ చారి, నీర్ల సతీష్, సద్గుణ చారి ,కొండల్ రెడ్డి ,శ్రీనివాస్ ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents