Print Friendly, PDF & Email

365 వేల ఎకరాల్లో పంట నీటి పాలు

ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు అంబ‌టి జోజిరెడ్డి

0 11

తెలంగాణ లో గత మాసం రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 365 వేల ఎకరాల్లో పంటలు నీటమునిగి పోయాయని వెంటనే రైతాంగాన్ని ఆదుకుని చేయూత నివ్వాలని ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ , రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు అంబ‌టి జోజిరెడ్డి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. భారీ వర్షాల నేపద్యంలో ఆయన మాట్లాడుతూ వర్షాలతో రైతాంగం భారీ గా నష్ట వాపోయారని, వాన నీటిలో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం తక్షణమే అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.వరదలతో అనేక గ్రామాలలో లక్షల ఎకరాల్లో పంటలు నీటమునిగి రైతులు నష్టపోయారన్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 88 వేల ఎకరాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 75 వేల ఎకరాలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో 69 వేల ఎకరాలు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 58 వేల ఎకరాల్లో పంట నీట మునిగిపోయిందని తెలిపారు. తెలంగాణలో 70 శాతం పంట అంతా నీటి పాలైనదని పేర్కొన్నారు. వరి, పత్తి, మిరప, వేరుశనగ, కంది పంటలు, పసుపు పంటలు నీట మునిగి పూర్తిగా అక్కరకు రాకుండా పోయిందని వాపోయారు. ఒక పక్క పంట నీట మునిగి అవస్థలు పడుతుంటే పాలకులు, ప్రభుత్వాలు పట్టించుకోకుండా రైతాంగాన్ని పరిహాసం చేస్తోదని ఆరోపించారు. మంత్రులు ​, ఎమ్మెల్యేలు కనీసం ఆ వైపు కన్నెత్తి చూడడం లేదన్నారు. నిత్యం ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప మరోటి లేదన్నారు. రాష్ట్రంలో టిడిపి, బీజేపీ పార్టీలు ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఒకరినొకరు తిట్టుకుంటూ ప్రజల్లో మరింత చులకన అవుతున్నారని అన్నారు. ఏ రెండు పార్టీలు కూడా తెలంగాణ లో అధికారం లోకి రావాలనే ఆలోచన ఉన్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. స్వార్థ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల సమస్యలను పాతర పెడుతున్నారని మండి పడ్డారు. వెంటనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూడాలని డిమాండ్ చేశారు. . వరద బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం అందించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు పడుతున్న నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అంబటి జోజిరెడ్డి డిమాండ్ చేశారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents