Print Friendly, PDF & Email

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కారమే పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

0 13

ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా 188 మంది ఫిర్యాదుదారుల నుండి వివిధ శాఖలకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫిర్యాదుదారుల సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించే విధంగా చూడాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఈడి ఎస్సి కార్పోరేషన్ శాఖకు సంబంధించిన 60 ధరఖాస్తులను, జిల్లా పంచాయితి కార్యాలయమునకు సంబంధించిన ధరఖాస్తులు 6, మిగిలిన శాఖలకు సంబంధించి 122 ధరఖాస్తులను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యాం ప్రసాద్ లాల్, మున్సిపల్ కమీషనర్ సేవాఇస్లావత్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జువేరియా, లాండ్ ఆండ్ సర్వే అధికారి అశోక్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, మత్స్యశాఖ అధికారి దేవెందర్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీలత రెడ్డి, జిల్లా పరిశ్రమల మేనేజర్ నవీన్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి రాజ మనోహర్ రావు, జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న, జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ది అధికారి నతానియేలు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మధుసుధన్, పీడీ మెప్మా రవిందర్, స్రీశిశు సంక్షేమాధికారి పద్మావతి, జిల్లా పంచాయితి అధికారి వీరబుచ్చయ్య, స్పోర్ట్స్ అధికారి రాజవీరు, డిప్యూటీ తహశిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents