Print Friendly, PDF & Email

జాతీయోద్యమ స్ఫూర్తితో గిరిజన హక్కులకై ఉద్యమించాలి*

బీమా సాహెబ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు-గిరిజన సంఘం

0 6

*పేస్ నోట్*
9-8-2022
👇👇👇

*జాతీయోద్యమ స్ఫూర్తితో గిరిజన హక్కులకై ఉద్యమించాలి*

*- బీమా సాహెబ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు-గిరిజన సంఘం*……………….
స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో గిరిజనులు తమ హక్కుల సాధనకు.. మరో పోరాటానికి సిద్ధం కావాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి. బీమా సాహెబ్ పిలుపునిచ్చారు .స్వతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని – ప్రపంచ గిరిజన హక్కుల దినం సందర్భంగా రామ్ నగర్ లో జాతీయ జెండాను గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.. అనంతరం భీమా సాహెబ్ మాట్లాడుతూ *ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా గిరిజన తెగలు తమ హక్కుల కోసం గిరిజన దినోత్సవం(World Tribal day) జరుపుకోవాలని 1994లో ఐక్యరాజ్యసమితి (UNO) పిలుపు నిచ్చింది*.అందులో భాగంగా తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిఏటా ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జరపకుండా గిరిజనులను అవమాన పరుస్తున్నాయని అన్నారు.ఈ ఏడాది ఆజాద్ అమృత్ మహోత్సవంలో భాగంగా *జాతీయ జెండాలు ఎగురవెద్ధాం – గిరిజన హక్కుల క్తె నినదిద్దాం* ” అనే నినాదాలతో ప్రతి తండా,గూడెం లో జరుగుతున్నట్లు తెలిపారు.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గిరిజన హక్కుల పై దాడిని తీవ్రతరం చేసిందని విమర్శించారు.గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసి సంబరాలు చేస్తున్న బిజేపీ ప్రభుత్వం… మరోవైపు అడవులపై ఆధారపడ్డ కోట్లాది మంది గిరిజనులను అడవుల నుండి గేంటివేసెందుకు, 1980 అటవీ సంరక్షణ చట్టాన్ని సవరించి అటవీ సంరక్షణ చట్టానికి నూతన నియమాలను రూపొందిస్తుందని అన్నారు.. అడవుల నుండి గిరిజనులను బలవంతంగా గేంటివేసి అడవులు, అటవీ సంపదను అంబానీ,ఆధానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.ఖనిజ సంపదను దోపిడీ చేసేందుకే ప్రైవేట్, కాంట్రాక్ట్, సంస్థలకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నదని వారు ఉన్నారు. *కోట్లాది మంది గిరిజనులను అడవుల నుండి వెళ్లగొట్టెందుకేనా…? గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేశారా*..? అని ప్రశ్నించారు.. తెలంగాణలో పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం 10 శాతానికి రిజర్వేషన్ ను పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా రాజకీయం చేస్తుందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం గిరిజన రిజర్వేషన్ పెంపుకు అన్ని హక్కులు ఉన్నా ,ముస్లిం రిజర్వేషన్ తో ముడిపెట్టి ఇవ్వము అని పార్లమెంట్లో ప్రకటించడం గిరిజనులను ద్రోహం చేయడమే నని ఆరోపించారు.. *రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ కోసం ప్రత్యేక బిల్లు పంపకుండా బిసి-ఈ తో కలిపి పంపి మోసం చేసిందని అన్నారు*. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తండాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. తక్షణమే ప్రతి గ్రామ పంచాయతీకి కోటి రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మైదాన ప్రాంత ITDA ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని అన్నారు. తమ హక్కుల కోసం గిరిజనులు పోరాటంలో కలసి రావాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలువంచీ తమ హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు .
*ఈ ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు నరేష్ పటేల్, జి .తిరుపతి గిరిజన సంఘం నగర అధ్యక్ష ,కార్యదర్శులు ప్రకాష్ ,రవీందర్ నాయక్ నాయకులు అజయ్,రాజ్ కుమార్, శ్రీనివాస్, భరత్, శివ అశోక్, వంశీ ,గోపిచంద్, రాజు,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు*.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents