Print Friendly, PDF & Email

కరీంనగర్ లో 2 వ రోజు ఘనంగా స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు

దేశభక్తిని చాటిచెప్పేలా ప్రతి ఇంటి పై జాతీయ జెండా ను ఎగరేయాలని ప్రజలకు అవగాహన చేసిన మంత్రి గంగుల.

0 13

* కరీంనగర్ లో 2 వ రోజు ఘనంగా స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు.

* 33 వ డివిజన్ లో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునిల్ రావు.

* దేశభక్తిని చాటిచెప్పేలా ప్రతి ఇంటి పై జాతీయ జెండా ను ఎగరేయాలని ప్రజలకు అవగాహన చేసిన మంత్రి గంగుల.

* ప్రపంచ దేశాలు ఈర్ష పడేలా… భారత దేశము గర్వించేలా స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు.

* కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్లు తరిమి అగర్వాల్, శ్యామ్ ప్రసాద్, తీపి సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి, మున్సిపల్ కమీషనర్ సేవా ఇస్లావత్.

ప్రపంచ దేశాల్లో 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారత దేశం దిన దిన అభివృద్ధి చెందుతూ… అన్ని రంగాల్లో ముందుకు సాగి ఆదర్శంగా నిలుస్తుందని పౌర సరఫరాల, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. భారత దేశం స్వాతంత్ర్యం సాదించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కరీంనగర్ లో అమృత్ మహోత్సవ్ లో బాగంగా స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 8 నుండి 22 వరకు జరిగే వజ్రోత్సవ వేడుకలు 2 వ రోజు ఘనంగా ముగిసాయి. ఇందులో భాగంగా మంగళవారం రోజు నగర ప్రథమ పౌరులు ప్రాతినిధ్యం వహించే 33 వ డివిజన్ భగత్ నగర్ లో మేయర్ సునిల్ రావు, కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్లు తరిమి అగర్వాల్, శ్యామ్ ప్రసాద్, తీపి సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణీ, కమీషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ ప్రారంభం చేశారు. నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యులు, అధికారులతో కలిసి 33 వ డివిజన్ భగత్ నగర్ లో ప్రతి ఇంటికి తిరిగి ఇంటి యజమానికి జాతీయ జెండాను అందించి… ఇంటిపై ఎగరేయాలని దేశ గౌరవాన్ని పెంచాలని మంత్రి గంగుల కమలాకర్ అవగాహాన పరిచారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… ప్రపంచ దేశాలు ఈర్ష పడేలా… భారత దేశం గర్వించేలా తెలంగాణ రాష్ట్రం లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు జరుపాలని మా నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కరీంనగర్ లో అమృత్ మహోత్సవ్ వేడుకలను ఘనంగా జరుపుతున్నామని తెలిపారు. 15 రోజులు షెడ్యూల్ కార్యక్రమం లో 2 వ రోజు 33 వ డివిజన్ ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ ప్రారంభించామన్నారు. కరీంనగర్ జిల్లా లో 3 లక్షల 8 వేల 7 వందల 54 ఇండ్లకు ప్రతి ఇంటికి జెండాలు చేరే వేస్తామన్నారు. స్వాతంత్ర్య వచ్చి 75 సంవత్సరాలు అయిందని… ప్రపంచ దేశాల్లో భారత దేశం అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉందని గుర్తు చేశారు. స్వాతంత్ర్య వచ్చి 75 పూర్తైంది కాబట్టి దేశ ప్రజలందరికిని ఇదీ ఒక పెద్ద పండగ అన్నారు. ఈ పండుగ ను ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని… బావి తరానికి దేశభక్తి ని పెంపొందిచే విధంగా 15 రోజుల కార్యక్రమాలు చేపట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 వ తేదీన ప్రతి ఇంటికి అందించిన జాతీయ జెండాల ను ఇంటిపై ఎగురవేసి… దేశం గర్వించేలా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరపాలని పిలుపు నిచ్చారు. అన్ని మతాలకు… అన్ని కులాలకు సంతోషంగా కలిసి మెలిసి జరుపుకునే పండగ అని…అందరు బాగ స్వాములు వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేసి దేశ ఖ్యాతిని పెంచాలని పిలుపు నిచ్చారు. 15 రోజుల కార్యక్రమాల్లో నగరంలో తల సేమియా తో బాధపడే వారి కోసం ప్రత్యేకంగా రక్తదానం, అనాద వృద్ద వికలాంగులు, హాస్పిటల్ లో రోగులకు పండ్ల పంపిణీ లాంటి సమాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు. బావి తరం కోసం జిల్లా వ్యాప్తంగా వృక్ష సంపద ను పెంచడం, బావి తరానికి ఉపయోగమయ్యో అన్ని కార్యక్రమాలతో వజ్రోత్సవ వేడుకలు చేస్తామన్నారు. 16 వ తేదీన ప్రత్యేకంగా దేశభక్తి పెంపోందించేలా… నగర వ్యాప్తంగా ఎక్కడి వారు అక్కడనే ఒకే సమయంలో జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తూ… గీతాలాపన చేయాలన్నారు. భారత దేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా వజ్రోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు, పోలీసులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents