Print Friendly, PDF & Email

దళిత జర్నలిస్టులకు దళిత బందు అమలు

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి గారికి తన నివాసంలో కలిసి వినతి పత్రం

0 7

దళిత జర్నలిస్టులకు దళిత బందు అమలు చేయాలని,దళిత జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో 100% పీజు రాయితీ కల్పించాలని వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు బందెల రాజశేఖర్ బుధవారం ఉదయం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి గారికి తన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బందెల రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం అమలు చేస్తూన్న దళిత బంధు పథకం ద్వారా దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తుంది. అందులో భాగంగా దళిత జర్నలిస్టులు ఏళ్ల తరబడి వివిధ పత్రికల్లో పనిచేస్తున్నప్పటికీ ఆర్థిక స్తోమత లేక, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళిత జర్నలిస్టులకు కూడా దళిత బంధు అమలు చేయాలని మంత్రిని కోరారు.అదేవిధంగా దళిత జర్నలిస్టుల పిల్లలను చదివిపించేందుకు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ప్రైవేటు విద్యాసంస్థల్లో 100% ఫీజు రాయితీ కల్పించాలని కోరారు.దీనికి మంత్రి కృషి చేయాలని కోరారు.దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దళిత జర్నలిస్టులకు దళిత బంధు అమలు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents