Print Friendly, PDF & Email

భావితరాలకు అభివృద్ది ఫలాలను అందిద్దాం

-రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

0 21

-16న ఎక్కడివారక్కడ సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొనండి
-ప్రధానాకర్షణగా 500 మీటర్ల భారీ జాతీయ పతాకం
ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం సాధించామని, అహింసా మార్గంలో మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం సాధించిన విధంగా, అదే స్ఫూర్తితో అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ సాధించారని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వ్రజ్రోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా అంబేడ్కర్ విగ్రహం నుండి తెలంగాణ చౌరస్తా వద్ద గల ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు నిర్వహించిన ఫ్రీడం రన్ కార్యక్రమంను రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, జిల్లా పరిషత్ చైర్మన్, సిపి, అదనపు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆర్ట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతు దేశ స్వతంత్ర సాధన కోసం ఎందరో మహానుభావులు నేలకొరిగారని ఆ మహనీయులను, స్వతంత్య్ర సమరయోదులను గుర్తుచేసుకుంటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు.

ప్రపంచదేశాలు చూసి ఈష్షపడేల, మన అభివృద్దిని చూసి విస్మయంచెందేలా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించిందని పేర్కోన్నారు. అహింసామార్గంలో పయనించి, ఉప్పుసత్యాగ్రహం వంటి ఎన్నో ఉద్యమాల ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించిన మహాత్మాగాంధీలా, అదే స్ఫూర్తితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారు కూడా అహింసా మార్గం ద్వారా తెలంగాణ సాధించారన్నారు. తెలంగాణ సాధనతో బంగారు భవిష్యత్తును భావితరలాకు అందించగలుగుతామని, స్వలాభం కోసం కాకుండా భవిష్యత్తు అభివృద్ది కొరకు పోరాడి తెలంగాణ సాధనకు కృషి చేసారని పేర్కోన్నారు. స్వాంతంత్య్ర సాధన కోసం కృషిచేసి అసువులుబాసిన వారిని, వారి త్యాగాలను గుర్తించి, వజ్రోత్సవాలలో మొక్కలు నాటడం, తలసేమియా వంటి ప్రమాదకరమైన వ్యాదులతో బాదపడుతున్న రోగుల కొసం రక్తదానం చేయాలని, అలాగే ఈనెల 16న ఎక్కడివారక్కడ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. ఈ నెల 22 వరకు నిర్వహిస్తే వజ్రోత్సవ కార్య క్రమంలలో పాల్గోని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశ స్వతంత్ర సిల్వర్,గోల్డెన్ ఉత్సవాల కన్న ఘనంగా ఇప్పుడు వజ్రోత్సవాలు నిర్వహించుకుంటు న్నామని మంత్రి అన్నారు మానకొండూర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ఎందరో మహనీయులు తమ సర్వస్వాన్ని ప్రాణాలను త్యాగం చేశారని, స్వతంత్య్ర సాధనలో మహాత్మగాంధి ఉప్పుసత్యాగ్రహాం, ఆహింసా మార్గాలను, సిద్ధాంతాలను, ఆశయాలను నేటి యువతరానికి తెలియజేయడంతొ పాటు మనం కూడా అదేమార్గంలో పయనిద్దామని అన్నారు. మహాత్మాగాంధి, డా. బి.ఆర్. అంబేడ్కర్ అశయాలను నిజం చేస్తు మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. తెలంగాణలో ప్రతి పౌరుడు జాతీయ జెండాను తమ ఇండ్లపై ఎగురవేసి జాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పాలని అన్నారు.ఫ్రీడం రన్ లో మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ కు చెందిన ఇంటర్నేషనల్ శ్యామ్ బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అంటూ శ్యామ్ బ్యాండ్ మ్యూజిక్ అందరికి ఎంతగానో ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై. సునీల్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు, పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు జి.వి. శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వార్, ఇతర ప్రజాప్రతినిధులు, మున్సిపల్ వైస్ చైర్మన్ చల్ల స్వరూపరాణి, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కార్పొరేటర్లు, జిల్లా అధికారులు, ఎన్ సిసి, ఎన్ఎస్ఎస్, పలు విద్యాసంస్థల విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, ఐకెపి, అంగన్వాడీ కార్యకర్తలు, గురుకుల వసతి గృహాల విద్యార్థులు, యువకులు తదితరులు పాల్గోన్నారు.

 

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents