Print Friendly, PDF & Email

అనసూయపై నెటిజన్ల ఫైర్ ఎందుకో తెలుసా?

0 29,542

బుల్లితెర గ్లామర్ క్వీన్ గా, యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు సాక్షి టీవీలో న్యూస్ ప్రెసెంటర్ గా పనిచేసిన ఈమె జబర్దస్త్ షో ద్వారా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంది.

ఇక అక్కడ సొంతం చేసుకున్న హోదాతో సినిమాలలో కూడా అవకాశాలు రావడం గమనార్హం. ఇకపోతే జబర్దస్త్ లో అనసూయతో పాటు సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న రష్మీ గౌతమ్, సుడిగాలి సుదీర్ , హైపర్ ఆది, మహేష్ , గెటప్ శ్రీను, రచ్చ రవి, ఆటో రాంప్రసాద్, చమ్మక్ చంద్ర ఇలా చాలామందికి కెరియర్ ఉండేది కాదు.. అప్ కమింగ్ నటులుగా వెలుగులోకి రావడం జరిగింది. అంతే కాదు వీరంతా ఆర్థికంగా, కెరియర్ పరంగా ఒక స్థాయికి వెళ్లారని చెప్పవచ్చు.అనసూయ..9 యేళ్ళ తరువాత అది అవమానమని గుర్తొచ్చిందా..?

ఇక రికార్డు స్థాయిలో టిఆర్పి రేటింగ్స్ సాధించడంతోపాటు తొమ్మిది సంవత్సరాలు తిరుగులేకుండా సాగిన జబర్దస్త్ కి ఇప్పుడు గడ్డ కాలం ఎదురైందని చెప్పాలి. ఇప్పుడు వివిధ కారణాలతో జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నారు. తాజాగా యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇకపోతే అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడానికి గల కారణాలేంటి అనే విషయంపై ఆమె నోరు విప్పలేదు.. కానీ ఎట్టకేలకు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇకపోతే చాలావరకు జబర్దస్త్ షో, నిర్మాతలు, టీం లీడర్స్ గురించి పాజిటివ్ గానే మాట్లాడిన అనసూయ తనకు ఎదురైన కొన్ని అవమానాలను, హద్దులు దాటి తనపై కామెంట్స్ చేశారన్న విషయాలను కూడా చెప్పుకొని బాధపడింది . అంతేకాదు ఒకానొక సమయంలో బాడీ షేమింగ్ కూడా ఎదుర్కొన్నానని చెప్పింది. అలాంటి అవమానాలు నేను భరించలేను.. నా అసహనం మాత్రం ఎడిటింగ్ లో తీసేసి ప్రేక్షకులకు తెలియనిచ్చేవారు కాదని అనసూయ వెల్లడించింది. అనసూయ చేసిన ఈ కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 9 సంవత్సరాల వరకు అవి నీకు అవమానంగా అనిపించలేదా ? ఇప్పుడిప్పుడే అవన్నీ నీకు అవమానంగా అనిపిస్తున్నాయా? అంటూ ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఒకవేళ నీకు ఇంతటి ఫేమ్ , నటిగా అవకాశాలు లేకుంటే జబర్దస్త్ లోనే అబమా, వదిలేసే దానివా అంటూ నిలదీస్తున్నారు. ఇక కెరియర్లో సెటిల్ అయ్యాక జబర్దస్త్ ని వదిలేసి ఇలా తనకు ఇష్టం వచ్చినట్లుగా మాటలు మాట్లాడుతోంది అంటూ ఈమెపై విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉండడం గమనార్హం.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents