Print Friendly, PDF & Email

కరీంనగర్ లో ఘనంగా 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 

నగర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ మరియు వజ్రోత్సవ శుభాకాంక్షలు. 

0 12

ఎంతో మంది ప్రాణ త్యగాల  ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు నగర మేయర్ యాదగిరి సునిల్ రావు. కరీంనగర్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా సోమవారం రోజు నగరంలో మేయర్ యాదగిరి సునిల్ రావు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మొదటగా నగరంలోని 33 వ డివిజన్ భగత్ నగర్ క్యాంపు కార్యాలయంలో సిబ్బంది మరియు డివిజన్ ప్రజలతో కలిసి జాతీయ జెండా ను ఎగరవేసిన గౌరవ వందనం చేస్తూ… జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం తెలంగాణ చౌక్ సమీపంలో గల ఫోర్ విల్లర్ టాక్సీ యూనియన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ను ఎగరవేసి.. గౌరవ వందనం చేశారు. మరో వైపు స్థానిక తెలంగాణ చౌక్ వద్ద గల ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ను ఎగరవేసిన గౌరవ వందనం చేశారు. అనంతరం కరీంనగర్ నగరపాలక సంస్థ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. కమీషనర్ సేవా ఇస్లావత్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణీ హరిశంకర్, పలువురు పాలకవర్గ సభ్యులు, అదికారులతో కలిసి మేయర్ సునీల్ రావు జాతీయ జెండా ను ఎగరవేసిన గౌరవ వందనం చేస్తూ… జాతీయ గీతాలాపన చేశారు. మరో వైపు మార్కెట్ రిజర్వాయర్ లో ఇంజనీరింగ్ విభాగం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ను ఎగరవేశారు. అంతే కాకుండా మున్సిపల్ కార్మిక విభాగం మరియు మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆద్వర్యంలో కార్మికులు, అధికారులతో కలిసి జాతీయ జెండా ను ఆవిష్కరించి గీతాలాపన చేశారు. మరో వైపు 33 వ డివిజన్ భగత్ నగర్ మల్లమ్మ మార్కెట్ వద్ద చైతన్య యూత్ క్లబ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ను ఎగరవేసి… గీతాలాపన చేశారు. అనంతరం 34 వ డివిజన్ పరిధలోని గోదాంగడ్డ ఎస్ బి ఎస్ ఫంక్షన్ హాల్ సమీపంలో గల ఆటో స్టాండ్ వద్ద ఆటో యూనియన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ను ఎగరవేసి… గౌరవ వందనం చేస్తూ… గీతాలాపన చేశారు. మరో వైపు 33 వ డివిజన్ భగత్ నగర్ అయ్యప్ప టెంపుల్ వద్ద ఆధర్శ యూత్ క్లబ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం భగత్ నగర్ పెద్దమ్మ దేవాలయం లో పెద్దమ్మ యూత్ క్లబ్, జై భూన్ యూత్ క్లబ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ను ఎగరవేసి గౌరవ వందనం చేస్తూ గీతాలాపన చేశారు. అంతే కాకుండా 13 డివిజన్ పరిధలోని రాంచద్రపూర్ కాలనీలోని పెద్దమ్మ దేవాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ను ఎగరవేశారు. మరో వైపు నగరంలో ని పురావస్తు మ్యూజియం సమీపంలోని కారు టాక్సీ యూనియన  మరియు బస్టాండ్ వద్ద ఆటో యూనియన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ను ఎగరవేసి… గౌరవ వందనం చేస్తూ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ… భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సహాకారంతో కరీంనగర్ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారత దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని తెలిపారు. ఇంకా రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగక ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు నిచ్చారు. దేశ ప్రజలు వచ్చిన స్వాతంత్రంను అనుభవిస్తూ… సుఖ సంతోషాలతో జీవిస్తన్నారని తెలిపారు. అంతే కాకుండా దేశం ఇంకా అభివృద్ధి చెందేలా మనమంతా సహాకరించాలన్నారు. ఎంతో మంది త్యాగం చేసి సాధించిన స్వాతంత్రంను కాపాడుకుంటూ… ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ వారి ఆశయాలను నిజం చేయాలని పిలుపు నిచ్చారు. భారత దేశంలో తెలంగాణ నూతన రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 8 ఏళ్ళ కాలంలో మిగితా రాష్ట్రాలతో పోల్చితే చాలా పురోగతిని సాధించిందన్నారు. రాష్ట్రం లో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అంది… సుఖ సంతోషాలతో రాష్ట్ర ప్రజలు జీవిస్తున్నట్లు తెలిపారు. భావి తరానికి సేచ్చా స్వాతంత్రంలో దేశాన్ని ఇంకా పురోగతి వైపుకు నడిపించాలని… సరైన వనరులను సమకూర్చి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని పిలుపు నిచ్చారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో కార్పోరేటర్లు, అధికారులు, పలు యూత్ క్లబ్ సభ్యులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents