ఇక నుంచి ఫోన్ పే, Google Pay, పేటీఎం లావాదేవీలపై చార్జీ.. ఆర్బీఐ కీలక నిర్ణయం..
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ మనీ ట్రాన్సాక్షన్ పై అవగాహన ఉంటుంది. అంతే కాదు.. వాళ్లు కూడా యూపీఐ ద్వారా పేమెంట్లు చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే.. యూపీఐ బేస్డ్ ఫండ్ ట్రాన్స్‌ఫర్‌పై కూడా ఛార్జీల విధింపునకు ఆబీఐ రంగం సిద్ధం చేస్తోంది. దీని ద్వారా నిర్వహణ ఖర్చులను తిరిగి పొందవచ్చని భావిస్తోంది. ఇలా యూపీఐ లావాదేవీలపై ఛార్జీని విధిస్తే ఎలా ఉంటుంది.. అనే కోణంలో ప్రజల నుంచి సూచనలు, సలహాలు తీసుకోనుంది. ఈ సూచనల ప్రకారమే డిజిటల్ పేమెంట్ ఛార్జీలను విధించే విధి విధానాలపై మార్గ దర్శకాలను రూపొందించే అవకాశం ఉన్నట్లు ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. యూపీఐ బేస్డ్ గా ఉన్న క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతో పాటు పీపీఐలపైనా ఈ ఫీజును విధించాలని భావిస్తోంది. UPI ఆధారిత లావాదేవీలే కాకుండా.. RTGS అండ్ NEFT ద్వారా కూడా చెల్లింపు జరుగుతుంది.
ఈ చెల్లింపులపై కూడా రుసుము ఉండనుంది. దీనికి సంబంధించి ఆర్బీఐ ఆగస్టు 17న డిస్కషన్ పేపర్ ను విడుదల చేసింది. ఈ అంశంపై ప్రజల అభిప్రాయాలను కోరింది. ఈ ఛార్జీల విధింపు అనేది అందరూ ఆమోదించే విధంగానే ఉంటాయని ఆర్బీఐ చెబుతోంది. ప్రస్తుతం కొన్ని ఆర్థిక సంస్థలు IMPSకు రుసుమును నిర్ణయించాయి. ఆర్‌బిఐ ప్రచురించిన నివేదికలో రాబోయే రోజుల్లో ఈ ఛార్జీలను ఆర్‌బిఐ నిర్వహిస్తుందని ప్రతిపాదించింది. డెబిట్ కార్డ్ లావాదేవీల కోసం ప్రస్తుతం PSO లు (పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు – PSO లు) వసూలు చేస్తున్న రుసుములను తగ్గించే బదులు, RBI ఫీజులో కొంత భాగాన్ని చెల్లింపు సిస్టమ్ ప్రొవైడర్లకు (PSPs) కేటాయించాలని ఆలోచిస్తోంది. రాబోయే రోజుల్లో PSOలలో క్రెడిట్ కార్డ్ వినియోగానికి సంబంధించిన ఛార్జీలను కూడా RBI నిర్వహించనుంది. దీని వల్ల డిజిటల్ పేమెంట్ సేవలు అందిస్తున్న ఇంటర్మీడియట్ ప్లాట్ ఫామ్ లకు కూడా కొంత ఆదాయం వస్తుందని పేర్కొంది.
ఇటీవల ఆర్‌బిఐ డెబిట్ కార్డ్‌పై ఇంటర్‌చేంజ్ ఛార్జీని విధించింది. దీని కారణంగా డెబిట్ కార్డ్ ఉపయోగించడం కూడా ఖరీదైనది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రజల నుంచి సూచనలు కోరింది. RBI తీసుకొస్తున్న ఈ ప్రతిపాదన అమలు చేయబడితే.. ఫోన్ పే, Google Pay, BHIM వంటి యాప్‌ల ద్వారా UPI ఆధారిత చెల్లింపు వ్యవస్థకు ఛార్జీలు వసూలు చేయబడతాయి. (ప్రతీకాత్మక చిత్రం)