యోగ మనిషి జీవితకాలాన్ని పెంచుతుంది: మేయర్ సునీల్ రావు.
* శారీరక ధారుడ్యం, మానసిక వికాసాన్ని పెంచే క్రీడ యోగ.
యోగ శారీరక దారుడ్యం పెంచి… మానసి ఒత్తిడిని తగ్గించే గొప్ప క్రీడ అని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లోని 33 వ డివిజన్ భగత్ నగర్ ఓ ప్రవేట్ పాఠశాలలో ( భగవతీ) సోమవారం రోజు యోగా క్రీడ పోటీలను ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా యోగాసనాల స్పోర్ట్స్ అసోసియేషన్ మరియు యోగా గోల్డ్ మెడలిస్ట్ని యమున ఆద్వర్యంలో నిర్వహించిన 2022 చాంపియన్ షిప్ పోటీలకు మేయర్ సునిల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యా. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి యోగా పోటీలను ప్రారంభించారు. పలువురు యోగ క్రీడాకారలు వేసిన వివిద రకాల యోగాసనాలు వేసి… పోటీల్లో పాల్గొన్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు ప్రస్తుత తెలంగాణ నుండి యోగాలో గోల్డ్ మెడల్ సాధించిన క్రీడ కారని యములను మేయర్ సునిల్ రావు అభినందించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… యోగ ఒక గొప్ప కళాత్మకమైన క్రీడ అన్నారు. యోగా క్రీడకు చాలా ప్రత్యేకత, ప్రాధాన్యత ఉందన్నారు. యోగ ల వేసే వివిద ఆసనాలు మనిషి శరీర ఆకృతిని అందంగా తీర్చిదిద్దడం తో పాటు వివిద రకాల వ్యాధులు రాకుండా మనిషికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందన్నారు. యోగా ద్వారా యవనత్వం పెరిగి… మనిషి జీవిత కాలాన్ని పెంచుతుందని తెలిపారు. అంతేకాక కాకుండా విద్యార్థులు యోగ క్రీడ పై ఆసక్తి చూపించి… యోగా ఆసనాలను నేర్చుకోవాలన్నారు. యోగా ద్వారా విద్యార్థుల్లో మేధాశక్తి పెంచడంతో పాటు క్రమ శిక్షణను కలిగిస్తుందన్నారు. యోగా జీవితంలో ఉపయోగపడే కళాత్మకమైన గొప్ప క్రీడ అన్నారు. యోగా పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్క విద్యార్థి మరియు క్రీడా కారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కంసాలి శ్రీనివాస్, సల్ల శారద రవీందర్, భగవతి స్కూల్ ఇంచార్జ్ సూపర్ రావు. యోగా గురువు ఆచార్య సంపత్ కుమార్, డాక్టర్ ప్రదీప్ కుమార్, ఎస్ డీ ఎఫ్ ఐ సెక్రటరీ సమ్మక్క, మాజీ సెక్రటరీ ఆర్ నర్సయ్య, జిల్లా యోహాను స్పోర్ట్స్ అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ బి. యమున తదితరులు పాల్గొన్నారు.