Print Friendly, PDF & Email

పార్టీ లైన్ దాటాడంటూ రాజాసింగ్ పై బీజేపీ వేటు 

ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ నుంచి సస్పెండ్

0 17

గోషామహాల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ పై అధిష్టానం వేటు వేసింది. బీజేపీ నుంచి రాజాసింగ్ ను సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేసింది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో నిర్వహించిన మునావర్ షోను రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. తాను వ్యతిరేకించినా.. షో నిర్వహించారని యూట్యూబ్ లో రాజాసింగ్ వీడియో విడుదల చేశాడు.అయితే ఈ వీడియోలోని కామెంట్స్ ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ ఫిర్యాదులతో పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న హైకమాండ్ రాజాసింగ్ పై చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో సెప్టెంబర్ 2వ తేదీలోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్ ను ఆదేశించింది.ఎమ్మెల్యే రాజాసింగ్ ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తమను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయనని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ కమిషనర్ కార్యాలయంతో పాటు భవానీ నగర్, డబీరపురా, రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ ముందు ముస్లీం నేతలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు ఇవాళ ఉదయమే రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents