Print Friendly, PDF & Email

రెచ్చి పోతున్న రేష‌న్ మాపియా

ఎఐఎఫ్‌బి రాష్ట్ర ఉపాధ్యాక్షుడు అంబ‌టి జోజిరెడ్డి

0 12

అధికార పార్టీ క‌నుస‌న్న‌ల్లో రేష‌న్ బియ్యం మాఫియా రెచ్చిపోతుంద‌ని, రేష‌న్ బియ్యం రాత్రికి రాత్రే పక్క రాష్ట్రాల‌కు త‌రిలించే ఆ 12 మంది గ్యాంగ్‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అల్ ఇండియా పార్వ‌ర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు అంబ‌టి జోజిరెడ్డి డిమాండ్ చేశారు. క‌రీంన‌గ‌ర్లో ఆయ‌న మాట్లాడుతూ రేష‌న్ బియ్యం దందా నిర్వ‌హించే 12 మంది రాజ‌కీయ నాయ‌కుల్లాగా చ‌లామ‌ణి అవుతూ వెలుతురులోనే చీక‌టి దందాను చాక‌చ‌క్యంగా కొన‌సాగిస్తున్నార‌ని అన్నారు. వారికి అధికార పార్టీలో ఓ మంత్రి స్థాయి నేత అండ‌దండ‌లు ఉన్నాయంటే వారికి రాజ‌కీయ నేత‌ల స‌ఫోట్ ఏలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. దాడుల స‌మ‌యంలో అడ్డామీది కూలీల‌ను తీసుకురావ‌డం.. ఆ త‌ర్వాత వారిని విడిపించ‌డంలో అస‌లు పందికొక్కులు బ‌య‌ట‌కు రావ‌డం లేద‌న్నారు. రేష‌న్ బియ్యం క‌రీంన‌గ‌ర్ దాని చుట్టుప‌క్క‌ల ప్రాంతాల‌తో పాటు శివారు గ్రామాల‌లో నిల్వ‌చేసి రాత్రికి రాత్రే మాయం చేస్తున్నారు. ఇటీవ‌ల రేకుర్తి, తీగ‌ల‌గుట్ట‌ప‌ల్లి
ప్రాంతాల‌లో నిల్వ‌చేసిన రేష‌న్ బియ్యం పోలీసులు ప‌ట్టుకోవ‌డంతో ఈ రేష‌న్ ఇయ్యం మాఫియా గుట్టుర‌ట్టు అయింద‌ని అన్నారు. ఈ వ్య‌వ‌హారంలో ఓ మంత్రి ముఖ్య అనుచ‌రుడు సైతం ఉండ‌డంతో రేష‌న్ మాఫియాకు అదుపు అడ్డూ లేకుండా పోయింద‌న్నారు. చీక‌టి వ్యాపారాన్ని అడ్డ‌కోవాల్సిన పాల‌కులు, పోలీసులు ఒక్క‌టి కావ‌డంతో…. ఇంటి దొంగ‌ను ఈశ్వ‌రుడైనా ప‌ట్టుకోలేడ‌న్న‌ట్లు ఉంద‌న్నారు. నామ మాత్రం సోదాలు, దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారే త‌ప్ప మ‌రోక‌టి లేద‌న్నారు. పోలీసులు కూడా ఈ మాఫియా పై చ‌ర్య‌లు తీసుకునేందుకు వెనుక‌డుగు వేస్తున్నార‌ని ఆరోపించారు. మంత్రి బందువులు, అనుచ‌రులు ఈ 12 మందిలో ఉన్నార‌నే ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయ‌ని వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. గ‌ల్లీల‌ల్లో 10 నుంచి 13 కిలోల రేష‌న్ బియ్యం కొనుగోలు చేసేటోన్ని ప‌ట్టుకోవ‌డం, కేసులు పెట్టి ఇబ్బందుల‌కు గురి చేయ‌డం త‌ప్ప 13 క్వింటాళ్ల వ‌ర‌కు రేష‌న్ బియ్యం నిత్వ‌లు చేసి రాత్రికిరాత్రే బారీ వాహానాల‌తో త‌ర‌లిస్తున్న రేష‌న్ మాఫియాను చూసి చూడ‌న‌ట్టు వ‌దిలేస్తున్నార‌ని ఆరోపించారు. కేవ‌లం 12 మంది చేతిలోనే రేష‌న్ మాఫియా దందా న‌డుస్తుంద‌న్నారు. రీ సైక్లింగ్ పేరిట ఇత‌ర రాష్ట్రాల‌కు త‌రిలించే ఈ గ్యాంగ్ పేర్లు ఎక్క‌డ లీక్ కాక‌పోవ‌డంపై మ‌రో విచిత్ర‌మ‌ని అన్నారు. వీరి వెనుక పెద్ద రాజ‌కీయ శ‌క్తి ఉంది కాబ‌ట్టే వీరంద‌రికి ఆ పెద్ద కాపాడుకుంటూ వ‌స్తున్నాడ‌ని ఆరోపించారు. ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌తినెలా భారీ మొత్తంలో చేతులు మార‌డంతో రేష‌న్ మాఫియా వ్యాపారం జోరుగా సాడుతుంద‌ని అన్నారు. పోలీసులు, పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ అధికారులు కొంద‌రు ఈ గ్యాంగ్‌కు ఏజంట్లుగా ప‌ని చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ముడుపులు అందుకున్న ఈ ఏజెంట్లు ముంద‌గానే దాడుల స‌మాచారం ఇవ్వ‌డం, వారిని కాపాడ‌డం లాంటి త‌తంగాలు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల 140 మందిపై రేష‌న్ బియ్యం త‌ర‌లిస్తున్నార‌నే నేపంతో బైండోవ‌ర్ చేసిన పోలీసులు ఈ 12 మంది బ‌డాచోర్ రేష‌న్ డాన్‌ల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. వెంట‌నే ఈ అలీబాబా డ‌జ‌న్ బియ్యం దొంగ‌ల‌పై కేసులు న‌మోదు చేయాల‌ని, పీడీ యాక్టు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents