Print Friendly, PDF & Email

జిల్లాలో కొత్తగా ఆసరా పింఛన్లు 31822 మంజూరు

రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

0 15

పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందనిశనివారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని టీవీ గార్డెన్స్ లో బొమ్మకల్, గోపాల్ పూర్ ,దుర్శేడ్ గ్రామాలకు చెందిన 596 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛను కార్డులను పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.జిల్లాలో ఇప్పటి వరకు 1,15,000 పెన్షనర్లు ఉండగా కొత్తగా 31,822 మందికి పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.తెలంగాణ రాకముందు పింఛను మంజూరు కోసం దరఖాస్తు ఇచ్చి దండంపెట్టిన గత పాలకులు పెన్షన్లు ఇచ్చిన పాపాన పోలేదని,కొత్తగా పెన్షన్ రావాలంటే మరొకరి చావు కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి ఉండేదన్నారు.అందరి పోరాటంతో తెలంగాణను సాధించుకున్నామని అన్నారు.
స్వయం పాలనలో అర్హులైన అందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. బొమ్మకల్ లో గతంలో 540 లబ్ధిదారులుంటే కొత్తగా 319 మందికి… దుర్శేడ్ లో 402 మంది లబ్ధిదారులుంటే కొత్తగా 224 మందికి గోపాల్ పూర్ లో 284 మంది ఉంటే కొత్తగా 53 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ అందించాలని సీఎం కేసీఆర్ చెప్పారు
57 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్ అందిస్తామని అన్నారు.
తెలంగాణ రాకముందు మన అందరం ఉన్నాం కానీ,అర్హులైన వారికి పెన్షన్ ఇచ్చేందుకు మనస్సు నాటి పాలకులకు రాలేదన్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents