దసరా లోగా సెంటర్ లైటింగ్ అందుబాటులోకి తెస్తాం. మంత్రి గంగుల కమలాకర్.

9 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం నుండి పద్మానగర్ మీదుగా ఒద్యారం వరకు సెంటర్ లైటింగ్ ఏర్పాటు.

దసరా లోగా సెంటర్ లైటింగ్ అందుబాటులోకి తెస్తాం. మంత్రి గంగుల కమలాకర్.

* 9 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం నుండి పద్మానగర్ మీదుగా ఒద్యారం వరకు సెంటర్ లైటింగ్ ఏర్పాటు.

* 2 కోట్లతో మానకొండూర్ చెరువును సుందరంగా అభివృద్ధి చేస్తున్నాం.

* 16 డివిజన్ పద్మానగర్ బైపాస్ జంక్షన్ వద్ద సెంటర్ లైటింగ్ ఏర్పాటు పనులకు భూమి పూజ చేసిన మంత్రి గంగుల కమలాకర్.

* కార్యక్రమం లో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, సుడా చైర్మన్ జీ. వి రామకృష్ణ రావు, వైస్ చైర్మన్ సేవా ఇస్లావత్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్.

కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా ప్రధాన బాధ్యత అన్నారు పౌర సరఫరాల శాఖ మరియు బిసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ అభివృద్ధి లో భాగంగా మంగళవారం రోజు శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఆద్వర్యంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, సుడా చైర్మన్ జీ.వి రామకృష్ణ రావు, వైస్ చైర్మన్ సేవా ఇస్లావత్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్ తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ సెంటర్ లైటింగ్ ఏర్పాటు పనులకు భూమి పూజ చేశారు. సుమారు చెందిన 9 కోట్ల రూ. నిధులతో నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం నుండి సిరిసిల్ల బైపాస్ రోడ్డులో పద్మానగర్ మీదుగా ఒద్యారం వరకు 8 వందల సెంటర్ లైటింగ్ పోళ్ళను ఏర్పాటు చేసే పనులను ప్రారంభం చేశారు. దసరా లోగా సెంటర్ లైటింగ్ పనులను పూర్తి చేసి అందించాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ… కరీంనగర్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిధులు లేవు అనకుండా విడుదల చేస్తూ… నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ప్రకటించి సుడా పరిదిలోని ప్రాంతాలన్నిటీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం మా బాధ్యత… ఇందుకోసం కోట్లాది రూపాయలు వెచ్చించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. కరీంనగర్ చుట్టు ప్రక్కల ప్రాంతాలను కూడ సూడా నిధులను కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో బాగంగా 9 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ విగ్రహం నుండి సిరిసిల్ల బైపాస్ పద్మానగర్ మీదుగా ఒద్యారం వరకు 8 వందల పోల్స్ ఏర్పాటు చేసి… చక్కటి లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే టెండర్లు పూర్తి కావడంతో పనులను ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ లోనే తొలి సారిగా కరీంనగర్ నగరంలోనే వైట్ లెడ్ లైట్లు కాకుండా… ఎల్లో కలర్ లో ఉండే వార్మ్ లెడ్ లైట్లను ఏర్పాటు చేస్తున్నాట్లు తెలిపారు. మంచు పడుతున్న సమయంలో కూడా ఈ లైట్ల వెలుతురులో రోడ్డు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. నగర ప్రజలకు దసరా పండగ వరకు సెంట్రల్ లైటింగ్ ను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ నుండి వేములవాడ వెళ్ళే ప్రధాన రహదారి కాబట్టి… ప్రతి పోల్ పై ఢమరుకం ఉండేలా డిజైన్ చేశామని తెలిపారు. అంతే కాకుండా కరీంనగర్ నుండి సిరిసిల్ల వరకు 100 కోట్లతో ఫోర్ లైన్ రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. 60 లక్షల రూపాయల సూడా నిధులతో రోడ్డుకు ఇరువైపులా… మధ్యలో..‌. మూడు వరుసల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే కరీంనగర్ లో సుడా ద్వారా జంక్షన్లను కూడ అభివృద్ధి చేశామన్నారు. ఎలగందల్ క్రాస్ రోడ్డు వద్ద కొత్తగా ఐలాండ్ ను సుందరీకరిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ లో గత 70 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. 2 కోట్లతో మానకొండూర్ చెరువును సుందరంగా అభివృద్ధి చేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రజలు మమ్మల్ని గెలిపించింది అభివృద్ధి కోసమే అని… ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి చేసి చూపిస్తూన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, స్థానిక కార్పోరేటర్ బోనాల శ్రీకాంత్ మరియు పలువురు కార్పొరేటర్లు, సుడా డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents