మట్టి గణపతిని పూజీస్తేనే… మహా పుణ్యం: మేయర్ సునీల్ రావు.
* ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నివారించండి.. పర్యావరణాన్ని పరి రక్షించాలి.
నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ లోని 33 డివిజన్ భగత్ నగర్ క్యాంపు కార్యాలయం వద్ద మేయర్ సునీల్ రావు డివిజన్ ప్రజలకు మంగళవారం రోజు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ లో బాగంగా మట్టి గణపతిని ప్రతిష్ఠించాలనే సంకల్పంతో నగరపాలక సంస్థ 10 వేల మట్టి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు డివిజన్ లో ప్రజలకువవిగ్రహాలను అందించారు. మట్టి విగ్రహాన్ని పూజించి.. పర్యావరణాన్ని పరి రక్షించాలని కోరారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ… మట్టి గణపతిని పూజిస్తే… మహా పుణ్యం కలుగుతుందన్నారు. నగర ప్రజలందరికి వినాయక చతుర్థ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు వినాయక చతుర్థి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని పిలుపు నిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే దృఢ సంకల్పంతో కరీంనగర్ నగరపాలక సంస్థ పరిదిలో 10 వేల మట్టి విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గణనాథుడు నగర ప్రజల సకల విజ్ఞములను తొలగించి.. ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలను ప్రసాదించాలన్నారు. పర్యావరణాన్ని రక్షించాలనే గొప్ప సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ శాఖ ద్వారా లక్షలాది మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయక విగ్రహాలను పూర్తి స్థాయిలో నివారించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వాడకం వల్ల, నీరు కలుషితం చెంది మానవాలికి ప్రమాదాన్ని తెస్తుందన్నారు. మట్టి తో చేసిన వినాయక విగ్రహాలను పూజించి…. వాతావరణన్ని కాపాడాలని ప్రజలను కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన ఎత్తైన భారీ విగ్రహాల కన్న… మట్టి తో చేసిన చిన్న విగ్రహాలే మిన్న అని పిలుపు నిచ్చారు. మట్టి విగ్రహాలను పెట్టాలని… నీటి కాలుష్యం ను నివారించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజలను అవగాహన పర్చాలన్నారు. నగర ప్రజలందరికి ముందస్తూ వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.