వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాజీనామా చేయాలి
బీఎస్పీ చొప్పదండి నియోజకవర్గ ఇంచార్జి కొంకటి శేఖర్
బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి మండల అధ్యక్షడు ఇరుగురాల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంకు బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి కొంకటి శేఖర్ హాజరయ్యారు ఈ సందర్బoగా కొంకటి శేఖర్ మాట్లాడుతూ
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన బాలింతల మృతికి బాధ్యత వహిస్తూ. ముఖ్యమంత్రి కేసీఆర్,మరియు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు బంగారు తెలంగాణ పేరుతో గత ఎనిమిదిన్నర సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య వ్యవస్థను పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు ఈ మరణాలకు కారణమని ఆయన ఆరోపించారు.మృతి చెందిన బాలింతల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల ఎక్స్ గ్రేసియా, కేటాయించి వారి పిల్లల ఉన్నత చదువు బాధ్యతలను ప్రభుత్వమే తీసుకోవాలని ఈ ఘటనకు కారణమైన వైద్యులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలనీ అన్నారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ ఇంచార్జి కొంకటి శేఖర్ మండల అధ్యక్షలు తంగళ్లపల్లి మల్లేష్ ఇరుగురాల రమేష్ మరియు బీఎస్పీ సీనియర్ నాయకులూ దికొండా సంజీవ్. ఆర్నాకొండా సెక్టార్ అధ్యక్షుడు పిట్టా మనోహర్ కాట్నపల్లి ప్రధాన కార్యదర్శి తడగొండ ప్రవీణ్ టౌన్ ప్రధాన కార్యదర్శి మాచర్ల రోహిత్ .రుక్మపూర్ సెక్టార్ ప్రధాన కార్యదర్శి తంగళ్లపల్లి అరవిందు .కాటం కార్తీక్ .తమ్మడి లవన్. రాగంపేట సెక్టార్ కార్యదర్శి దీకొండ సాయి .రామన సాయి మహేష్ .మల్లయ్య .దుర్గయ్య .
చొప్పదండి టౌన్. హరీష్ .సాదిక్ అబ్దుల్ రజాక్ .మహేందర్ తదితరులు హాజరయ్యరూ