ఎమ్మెల్సీ రమణ జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్సీ ఎల్ రమణ జన్మదిన వేడుకలు జగిత్యాల శుభమస్తు గార్డెన్స్ లో ఆదివారం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేకు కోసి కార్యకర్తలు, నాయకులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్, నాయకులు పాల్గొన్నారు.