వీరనారి చాకలి ఐలమ్మ ఘన నివాళులు.
- ఏఐఎఫ్ బి కరీంనగర్
వీరనారి చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్బంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎల్ ఐ సి ఆఫీస్ చౌరస్తాలో చిత్రపటానికి మరియు ప్రతిమ మల్టీప్లెక్స్ చౌరస్తాలోని విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
అనంతరం అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ తెలంగాణా వీరవనిత అని, దున్నే వాడికే భూమి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసంవిసునూర్ దేశ్‌ముఖ్, రాపాక రాంచంద్రారెడ్డికి మరియు రజాకర్ల అరాచకాల పై ఎదురు తిరిగి పోరాడిన వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. స్త్రీల మీద జరిగే ఆఘాయిత్యలకు వ్యతిరేకంగా ఉద్యమించినరని అన్నారు.ప్రతిమ మల్టిప్లెక్షి వద్ద చిట్యాల ఐలమ్మ విగ్రహం వద్ద ఆమె వర్ధంతి సందర్బంగా పులా మాలలు వేయడానికి విగ్రహం వద్ద నిచ్చెన ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. చాలా దురదృష్టకరమని ఐలమ్మను అవమానించడం అన్నారు. దీనికి జిల్లా అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐలమ్మ స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా,కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేసి పోరాటాలకు తీసుకురావాలని పిలుపునిచ్చారు. నిత్యాసవర వస్తువులు ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పేదవాడికి అందని ద్రాక్షగా మారుతున్నా యని ఎద్దవా చేశారు. ప్రభుత్వ సంస్థలను అన్నింటినీ ప్రయివేట్ చేస్తున్నారని విమర్శించారు. పసిపిల్లలు తాగే పాల ధరలు కూడా పెంచడం సిగ్గుచేటని విమర్శించారు. చాకలి ఐలమ్మ స్పూర్తితో ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కరీంనగర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పులిమాటి సంతోష్, అగ్రగామి మహిళా సమితి జిల్లా కన్వీనర్ ఐల ప్రసన్న, బిల్లింగ్ సంఘం జిల్లా కన్వీనర్ బెక్కంటీ రమేష్ పాల్గొన్నారు.