పొన్నం అనిల్ గౌడ్ కు మంత్రి గంగుల శుభాకాంక్షలు
కరీంనగర్ గ్రంథాలయ చైర్మన్ గా నియమితులైన పొన్నం అనీల్ కుమార్ గౌడ్ మంత్రి గంగుల కమలాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల గ్రంథాలయ చైర్మన్ గా నియమితులైన పొన్నం అనీల్ కుమార్ గౌడ్ అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి గంగుల మాట్లాడుతూ తెరాస పార్టీలో విద్యార్ధి నాయకుడిగా ఉన్నప్పటినుండి అనిల్ కుమార్ పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డాడని, పార్టీ కోసం పని చేసిన వారికీ తప్పకుండ తగిన ఫలితం అందుతుందని తెలియయజేశారు. మంత్రి గంగుల కమలాకర్ తో పాటుగా, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు , డిప్యూటీ మేయర్ చల్ల హరిశంకర్ లు పొన్నం అనీల్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు.