Print Friendly, PDF & Email

హత్యలు చేయించిన చరిత్ర ఈటలది

0 17,957

గోతులు తవ్వే ఈటల నీతులు చెబుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియా మాట్లాడుతూ. తనకు, తన కుటుంబానికి రక్తం కారినా కేసిఆర్ దే భాధ్యతని ఈటల అంటున్నారని.. కేసిఆర్ ది రక్త చరిత్ర కాదన్నారు. ఈటలదే  హత్యలు చేయించిన చరిత్ర అని ఆరోపించారు. నర్సింగపూర్ గ్రామంలో బాలరాజు అనే వ్యక్తిని చంపించింది ఎవరని  కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. వీణవంకలో గెల్లు మల్లయ్యపై హత్యాయత్నం, కరాటే సమ్మయ్యను పోలీసులతో చిత్రహింసలు పెట్టించింది నువ్వు కాదా అని ఈటలను ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ కనిపించేంతా అమాయకుడు కాదని  కౌశిక్ రెడ్డి అన్నారు. తాను చెప్పేది తప్పు అయితే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతానని ఆయన స్పష్టం చేశారు.

హత్యలు చేయించిన చరిత్ర ఈటలది

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents