జగిత్యాలలో దారుణం కత్తితో దాడి
జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ళ భావి సమీపంలో బుధవారం జంగిలి సంతోష్ పై అతని తమ్ముడు గణేష్ కొబ్బరికాయలు కోసే కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో అన్న సంతోష్ తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్ తరలించారు. కుటుంబ కలహాల నేపధ్యంలో ఈ దాడి జరిగిందని స్థానికులు తెలిపారు.