Print Friendly, PDF & Email

ఆర్ఎఫ్సీఎల్ బాధితుల సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి

0 4,181

రాజకీయ ప్రయోజనాల కోసమే సమస్యను జఠిలం చేయడానికి కాంగ్రెస్, బిజెపి నాయకులు కుట్రలు చేస్తున్నారని దీనిని ఆర్ఎఫ్సీఎల్ బాధితులు, ప్రజలందరూ గమనించాలని రామగుండం డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు అన్నారు. బుధవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ. ఆర్ ఎఫ్ సీఎల్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగ యువకులను మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసిన కొంతమంది దళారుల నుండి బాధిత నిరుద్యోగ యువకులకు తిరిగి డబ్బులు ఇప్పించేందుకు కృషి చేస్తున్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. అఖిలపక్ష కమిటీ లో ఉన్న నాయకులు ప్రజా సమస్యల పరిష్కారంలో ఎంతో అనుభవం ఉన్నవారని అన్నారు. రాజకీయ లబ్ధి పొందేందుకు కొంత మంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఆర్ ఎఫ్ సీ ఎల్ బాధితుల సమస్య పరిష్కారానికి సహకరించకుండా బాధితులతో ప్రేరేపిత ఆందోళనలు చేయించడం దుర్మార్గపు చర్య అని ఆయన మండిపడ్డారు. ఆందోళనలో ఉన్న వారిలో కాంగ్రెస్ క్రియాశీలక వ్యక్తులచే బాధితులతో వేషం వేయించి తప్పుడు ఆరోపణలు చేయిస్తున్న కాంగ్రెస్ నాయకులు వాస్తవాలను విస్మరిస్తున్నారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జడ్పిటిసి ఆముల నారాయణ, కార్పొరేటర్లు, నాయకులు తానిపర్తి గోపాలరావు, అడ్డాల రామస్వామి, దొంత శ్రీనివాస్, కృష్ణవేణి, వంగ శ్రీనివాస్ గౌడ్, కుమ్మరి శ్రీనివాస్, అయిత శివకుమార్, అంజలీదేవి, జేవి రాజు, గుంపుల ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

ఆర్ఎఫ్సీఎల్ బాధితుల సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents