Print Friendly, PDF & Email

ముగ్గురి పై కత్తి తో దాడి చేసిన వృద్దుడు!

0 78,420

ఆవేశానికి గురైన వృద్దుడు ముగ్గురి పై కత్తి తో దాడి చేయగా ఇద్దరి పరిస్థితి విషమం గా ఉంది. మంగళవారం అర్థరాత్రి దాటాక గోదావరిఖని హనుమాన్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి జంగిలి మొగిలి, మామిడాల పోశం లు హనుమాన్ నగర్ లో పక్క పక్కన నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా మామిడాల పోశం కు చెందిన ఏసీ పైపు మొగిలి ఇంటి వైపు తెరుచుకొని నీళ్ళు పోస్తున్నాయని, గత రాత్రి కూడా ఇలాగే జరగడంతో పోషం ను మొగిలి హెచ్చరించాడు. ఈ వివాదంలో ఆవేశానికి గురైన మొగిలి తన వద్ద ఉన్న కత్తితో పొషం మనవడైన నామని సాయివరణ్ కడుపులో విచక్షణ రహితంగా పొడిచాడు. అడ్డుగా వచ్చిన సాయికిరణ్ తాత మామిడాల పోషం ను, దగ్గర బంధువైన జుంజుపల్లి శేఖర్ పై దాడి చేశాడు. దీంతో వారికి తీవ్ర గాయాలు కాగా కాలనీవాసులు పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. పోషం , సాయి వరుణ్ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం బుధవారం కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ముగ్గురి పై కత్తి తో దాడి చేసిన వృద్దుడు!

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents