Print Friendly, PDF & Email

ఆ ఆరోపణల్లో నిజం లేదు

0 8,158

అనేకమందికి గన్ లైసెన్స్ ఇస్తున్నారనే ఆరోపణలు అవాస్తవమని కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. బుధవారం కరీంనగర్ సిపి సత్యనారాయణ హుజురాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భద్రత దృష్ట్యా గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారి ప్రాణహానిపై అంచనా ఆధారంగా అసాంఘీక వ్యక్తుల నుండి, మావోయిస్టుల నుండి ఉన్నటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొనుటకు నిబంధనల మేరకు మాత్రమే వారికి గన్ లైసెన్స్ జారీ చేయడం జరిగిందన్నారు.

ఇటీవలి కాలంలో జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ పొలినేని సత్య నారాయణ రావు, తనకు మావోయిస్టుల నుండి ప్రాణహాని ఉందని గన్ లైసెన్స్ దరఖాస్తు చేసుకోగా, ఇట్టి దరఖాస్తుపై విచారణ చేసి అతనికి గన్ లైసెన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ఇల్లందకుంట ఎంపిపి భర్త అయిన సరిగొమ్ముల వెంకటేశం తనకి మావోయిస్టులు, ప్రత్యర్థుల నుండి ప్రాణహానీ ఉందని గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఇట్టి దరఖాస్తుపై విచారణ జరిపి నిబంధనల మేరకే గన్ లైసెన్స్ జారీ చేయడం జరిగిందని అన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించిన విధంగా హుజురాబాద్ నియోజకవర్గంలో చాలా మందికి గన్ లైసెన్సులు ఇచ్చారనేది పూర్తి అవాస్తవమని అన్నారు.

ఆ ఆరోపణల్లో నిజం లేదు

గడిచిన రెండేండ్లలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఇద్దరికి తప్ప ఎవరికీ గన్ లైసెన్లు ఇవ్వలేదన్నారు. ఇప్పటివరకు ఎవరూ దరఖాస్తు కూడా చేసుకోలేదని సీపీ తెలిపారు. లైసెన్స్ ఉన్న గన్ ను నిబంధనల మేరకే వాడాలని, ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎసిపి కోట్ల వెంకట్ రెడ్డి, హుజురాబాద్ టౌన్ సిఐ వీరబత్తిని శ్రీనివాస్, హుజురాబాద్ ఎస్ఐ రాజన్న, జమ్మికుంట టౌన్ సిఐ రాంచందర్ రావు, రూరల్ సిఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents