Print Friendly, PDF & Email

మూడేళ్ల క్రితం ప్రేమ వివాహాం.. ఆ పని చేయలేదని భార్యను చంపిన భర్త..

0 24,811

కొందరు యువత ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. మొదట్లో కొన్నిరోజుల పాటు వీరి కాపురం సాఫీగానే సాగిన, ఆ తర్వాత.. వీరి మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి.

ప్రేమించినప్పుడు, గుర్తుకురాని కట్టుబాట్లు, ఆచారాలు పెళ్ళి చేసుకున్నాక మాత్రం పాటించాలని వేధిస్తుంటారు. కొందరు భార్యలను తమ ఆచారాలు పాటించాలని వేధిస్తున్నారు. మరికొందరు కోపంలో కంట్రోల్ తప్పి భార్యలను చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ముంబైలో (mumbai) అమానవీయకర సంఘటన జరిగింది. ఇక్బాల్ షేక్ అనే వ్యక్తి, రూపాలి అనే హిందూ యువతిని 2019లో పెళ్లి చేసుకున్నాడు. ఆమె తన పేరును జరాగా మార్చుకుంది. 2020 లో వీరికి కొడుకు పుట్టాడు. అయితే.. కొన్ని రోజులుగా భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బురఖా ధరించాలని భార్యను వేధించడం మొదలు పెట్టాడు. దీనికి ఆమె ఒప్పుకోలేదు.

అతని వేధింపులు రోజురోజుకి ఎక్కువ కావడంతో ఆమె తన కొడుకుతో కొన్నినెలలుగా విడిగా ఉంటుంది. దీంతో సెప్టెంబరు 26 న మాట్లాడుకుందామని ఆమెను పిలిచాడు. ఆ తర్వాత.. రాత్రి 10 గంటల సమయంలో ఆమెను కత్తితో పొట్టలో పలుమార్లు పొడిచి హత్య చేశాడు. దీంతో ఆమె అక్కడే చనిపోయింది. దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మూడేళ్ల క్రితం ప్రేమ వివాహాం.. ఆ పని చేయలేదని భార్యను చంపిన భర్త..

ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీ లో షాకింగ్ ఘటన జరిగింది.

ఇప్పటి వరకు మన దేశంలో అమ్మాయిలకే భద్రత లేదని నిరూపించే ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఇక తాజాగా, జరుగుతున్న ఘటనలతో అబ్బాయిలకు కూడా సరైన భద్రత కరువైందని తెలుస్తోంది. కొందరు కామాంధులు పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. అబ్బాయిలపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీలో (Delhi) జుగుప్సాకర సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. సీలంపూర్ లోని ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత.. అతడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలుడి నోట్లో గుడ్డలు కుక్కి అరవకుండా మరీ నీచపు పనులు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన సెప్టెంబరు 22న జరిగింది. ఆలస్యంగావెలుగులోనికి వచ్చింది. బాలుడు ఇంట్లో షాక్ తో ఉండటంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. అప్పుడు జరిగిన దారుణాన్ని బాలుడు ఇంట్లో వారితో తెలిపాడు. బాలుడిని కిడ్నాప్ చేసి… సాముహిక అత్యాచారం చేశారని, ప్రైవేటు పార్ట్ లలో రాడ్ ను కూడా దింపినట్లు బాలుడు తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents