Print Friendly, PDF & Email

కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ కు మంత్రి కేటీఆర్‌ అభినందనలు

0 17,710

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 ఫలితాల్లో జాతీయ స్థాయిలో కొత్తపల్లి మున్సిపాలిటీ మొదటి ర్యాంకు సాధించగా, మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, కమిషనర్‌ వేణుమాధవ్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీఐ దాశరథి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో చైర్మన్‌, కమిషనర్‌ను శాలువాలతో సత్కరించి జ్ఞాపికతోపాటు క్లీన్‌సిటీ అవార్డును ప్రధానం చేశారు.

కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌, కమిషనర్‌కు మంత్రి కేటీఆర్‌ అభినందనలు

కీపిటప్‌.. బాగా పనిచేశారంటూ ప్రశంసించారు. కొత్తపల్లి మున్సిపల్‌కు ప్రోత్సాహకంగా శానిటేషన్‌, వైకుంఠధామం నిర్వహణ కోసం 2 కోట్ల నిధులు మంజూరు చేశారు. రాబోయే రోజుల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో సీఎస్‌ అరవింద్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్‌ రమేశ్‌ పాల్గొన్నారు. అయితే కొత్తపల్లి పట్టణానికి జాతీయ స్థాయిలో అవార్డు రావడంతో కొత్తపల్లి ప్రజలు, తెరాస నాయకులూ ఆనందంతో సంబరాలు చేసుకున్నారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents