కోరుట్లలో కత్తిపొట్ల కలకలం
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహనరావు పేట గ్రామంలో బుధవారం సాయంత్రం మునుగంటి రాజేశంపై అతని ఇంటి పక్కన ఉన్న మునుగంటి దశరథం కత్తితో దాడి చేశాడు. మునుగంటి రాజేందర్, మునుగంటి రాజేశం అలియాస్ దశరథం సొంత అన్నతమ్ములు ఇంటి వద్ద గొడవ పడుతుండగ ఇంటి పక్కన ఉన్న మునుగంటి రాజేశం ఇద్దరికి ఆపే ప్రయత్నం చేయగా మునుగంటి రాజేశం అలియాస్ దశరథం మునుగంటి రాజేశంను కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.