Print Friendly, PDF & Email

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

0 2,795

తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పింది. మరి కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తుందని హెచ్చరించింది. పిడుగులు కూడా పడతాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఈ వర్షాలకు కారణమని చెప్పింది.

మరోవైపు ఇవాళ (బుధవారం) ..హైదరాబాద్ పాటు పలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచే వానలు మొదలయ్యాయి. హైదరాబాద్ లో అయితే సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురింది.

Rains

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents