Print Friendly, PDF & Email

మంత్రి గంగుల కొత్త కేరవాన్?

0 175,239

మంత్రి గంగుల కొత్త క్యారవాన్ కొన్నారా? అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఒక కొత్త క్యారవాన్ మంత్రి గంగుల కమలాకర్ ఇంటి ముంగిట దర్శనం ఇచ్చింది. అయితే ఇటీవల బతుకమ్మ దసరా పండుగ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ లో కరీంనగర్ కళోత్సవాలు పేరిట భారీ కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి నటీనటులు, కళాకారులూ వచ్చారు అయితే వారికోసం మంత్రి క్యారవాన్ తెప్పించారేమో అని అనుకున్నారు. అయితే కార్యక్రమం అయిపోయి 2రోజులు అవుతున్న కూడా ఇంకా క్యారవాన్ మంత్రి గంగుల ఇంటిముందే ఉండటంతో మంత్రి తన పర్యటనల కోసం క్యారవాన్ కొన్నారనే వార్తలు వినపడుతున్నాయి. దాదాపు 6కోట్ల రూపాయల ఈ క్యారవాన్ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని, విలాసవంతమైన ఈ క్యారవాన్ లో అధికారులతో, ప్రజాప్రతినిధులతో, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక ఏర్పాటు, భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్, అట్టచేడ్ బాత్రూం తో అలసిపోయినపుడు విశ్రాంతి తీసుకోవడానికి బెడ్ కూడా ఉంటుందని, 3స్టార్ హోటల్ లో ఉండేవిధంగా అన్ని సదుపాయాలు ఈ క్యారవాన్ లో ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ నటులు ఉపయోగించే ఇలాంటి విలాసవంతమైన క్యారవాన్ మంత్రి గంగుల కొనుగోలు చేయడం ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నిత్యం ప్రజా సమస్యల కోసం పరితపిస్తూ, ప్రజలను కలవడానికి ప్రతిరోజు గ్రామగ్రామాన తిరిగే నాయకుడు ఐన మంత్రి గంగుల కమలాకర్ లాంటి వారికీ ఇలాంటి క్యారవాన్ ఎంతో అవసరం అని, దాని వలన శ్రమ, అలసట తగ్గి మరింత ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇంతకీ మంత్రి గంగుల కమలాకర్ క్యారవాన్ కొన్నారా లేదా అనే విషయాలు త్వరలో తెలిసే అవకాశాలు లేకపోలేదు.

The Ultimate Guide to Campers, Caravans and Motorhomes in India - Overdrive

7 caravans you can hire for a road trip around India | Condé Nast Traveller India

Motorhome layouts guide - Advice & Tips - Motorhomes & Campervans - Out and About Live

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


Social Media Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
Karimnagar News page contents